ఆసియా దేశాలకు పొంచివున్న సునామీ ఉపద్రవం

ఫిలిప్పీన్స్ లో అతి భారీ భూకంపం సంభవించింది. ఆ దేశ దక్షిణ ప్రాంతాన్ని వణికించింది. దీని ప్రకంపనల తీవ్రత పొరుగు దేశాల్లోనూ కనిపించింది. ఇండొనేషియాలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి. భూకంప తీవ్రత అంచనాలకు మించి ఉండటంతో సునామీ హెచ్చరికలు సైతం జారీ అయ్యాయి. పలు ఆసియాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. ఫిలిప్పీన్స్ భూకంపంలో భారీగా ప్రాణ, ఆస్తినష్టం సంభవించింది. పలు భవనాలు కుప్పకూలాయి. అయిదుమంది దుర్మరణం పాలయ్యారు. 200 మందికి పైగా గాయపడ్డరు. మిండానావు రీజియన్ లో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.

ఫిలిప్పీన్స్ దక్షిణ ప్రాంతంలోని మిండానావు రీజియన్ లో ఈ తెల్లవారు జామున ఈ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై దీని తీవ్రత 7.8గా నమోదైంది. జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ (GFZ) వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ భూకంపం భూమి ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున టెక్టానిక్ ప్లేట్లల్లో చోటు చేసుకున్న పెను కదలికల వల్ల భూమి ప్రకోపించింది. తొలుత భూకంప తీవ్రతను 7.3గా అంచనా వేశారు. ఆ తర్వాత దానిని 8.2కి పెంచారు. అనంతరం 7.8గా ఖరారు చేశారు.

Several Asian Countries Raise Alarm Over Tsunami Threats After 7 8 Strong Earthquake Hit Philippines

భూకంప కేంద్రం బురియాస్ పట్టణానికి పశ్చిమ-నైరుతి దిశలో 24.7 కిలోమీటర్ల దూరంలో, సుమారు 35 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉంది. భూమిలో సంభవించిన ఈ ప్రకంపనల తీవ్రత కారణంగా నివాస ప్రాంతాల్లో భారీ నష్టం వాటిల్లింది. భూకంపం తర్వాత యుఎస్ సునామీ వార్నింగ్ సిస్టమ్ ప్రమాదకరమైన అలలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇండోనేషియా జియోఫిజిక్స్ ఏజెన్సీ కూడా తమ దేశ ఈశాన్య తీర ప్రాంతాల కోసం సునామీ హెచ్చరికలను జారీ చేసింది.

ఫిలిప్పీన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వోల్కనాలజీ అండ్ సిస్మోలజీ (PHIVOLCS) సునామీ అలలు సాధారణ ఆటుపోట్ల కంటే ఒక మీటరు ఎత్తులో వచ్చే అవకాశం ఉందని స్పష్టం చేస్తూ, తీరప్రాంత నివాసితులను వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని హెచ్చరించింది. భూకంప తీవ్రతను దృష్టిలో ఉంచుకుని, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా దేశాలు తమ తీరప్రాంతాల కోసం అత్యావసర సునామీ హెచ్చరికలను జారీ చేశాయి.

ఇండోనేషియాలోని జియోఫిజిక్స్ ఏజెన్సీ కూడా తమ దేశ ఈశాన్య తీరప్రాంతాల్లో సునామీ హెచ్చరికలను జారీ చేసింది. అక్కడ నివసించే ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ, ప్రభుత్వ ఆదేశాలను తూచ తప్పకుండా పాటించాలని సూచించింది. ప్రపంచంలోనే భూకంప ముప్పు ఎక్కువగా ఉండే దేశాల్లో ఫిలిప్పీన్స్ ఒకటి. పసిఫిక్ మహాసముద్రంలోని 'రింగ్ ఆఫ్ ఫైర్' అనే కీలక ప్రాంతంలో ఉండటం వల్లే, ఇక్కడ తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి.

సరాంగణి, దావావో ఆక్సిడెంటల్, తావీ-తావీ, సులు వంటి తొమ్మిది ప్రావిన్సుల ప్రజలు వెంటనే ఎత్తైన ప్రాంతాలకు లేదా లోతట్టు ప్రాంతాల నుంచి సురక్షితంగా తరలివెళ్లాలని అధికారులు ఆదేశించారు. ఇండోనేషియాలో కూడా ఉత్తర సులవేసి, ఉత్తర గొరోంటలో ప్రావిన్స్, సాంఘి ఐలాండ్స్ వాసులను అప్రమత్తం చేస్తూ, వెంటనే పై ప్రాంతాలకు వెళ్లాలని సూ సూచనలు జారీ చేశారు. జపాన్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియాలోని తీర ప్రాంతాల్లో ప్రమాదకరమైన అలలు వచ్చే అవకాశం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.

పసిఫిక్ సునామీ వార్నింగ్ సెంటర్ అంచనాల ప్రకారం, ఫిలిప్పీన్స్ తీరంలో అలలు 3 మీటర్ల (9.8 అడుగులు) ఎత్తు వరకు, ఇండోనేషియా, మలేషియా తీరాల్లో మీటర్ (3.3 అడుగులు) ఎత్తు వరకు వచ్చే అవకాశం ఉంది. జపాన్ వాతావరణ సంస్థ విశ్లేషణ ప్రకారం ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, దక్షిణ జపాన్, తైవాన్ తీరాలను సునామీ అలలు తాకవచ్చు. ఆ తర్వాత మైక్రోనేషియా, పాపువా న్యూ గినియా, సోలమన్ దీవులకు అలల తాకిడి ఉండవచ్చు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+