షాకింగ్, భయపడ్డారు: రెండు విమానాలు ఢీకొంటే..!
షాంఘై: రెండు విమానాలు ఒక దానికి మరొకటి తగిలితే ఎలా ఉంటుందో ఊహించుకుంటే భయం వేస్తుంది. ఇలాంటి సంఘటన షాంఘైలోని హంకియో అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద చోటు చేసుకుంది. రెండు విమానాలు కొంత మేర తగిలాయి.
ఈ రెండు విమానాలు కూడా చైనా ఈస్ట్రన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ప్రయాణీకుల విమానాలే. ఓ విమానం తన ప్రయాణం ముగించుకొని సురక్షితంగా దిగి టెర్మినల్ వద్దకు వస్తోంది. ఆ సమయంలో మరో విమానం ప్రయాణీకులను ఎక్కించుకొని బయలుదేరేందుకు రన్ వే వైపు కదిలేందుకు సిద్ధమైంది.

ఇంతలో పెద్ద శబ్ధం వచ్చింది. అందరు చూస్తుండగానే వాటి రెక్కలు ఒకదానికి మరొకటి తగిలాయి. అందులో ఓ విమానం రెక్క సగానికి పైగా చీలిపోయింది. రెండు విమానాలలోని ప్రయాణీకులు అదిరిపడ్డారు. వెంటనే ఆ విమానాలను నిలిపివేశారు. ప్రయాణీకులను దింపేశారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.












Click it and Unblock the Notifications