వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్నికలు అయ్యేదాకా: నవాజ్ షరీఫ్, కూతురుకు కోర్టులో షాక్

By Srinivas
|
Google Oneindia TeluguNews

లాహోర్: పాకిస్తాన్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు కోర్టులో మంగళవారం ఎదురుదెబ్బ తగిలింది. నవాజ్ షరీఫ్, ఆయన కూతురు మర్యం షరీఫ్ బెయిల్ పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. జూలై నెలాఖరుకు దానిని వాయిదా వేసింది. పాకిస్తాన్‌లో ఎన్నికలు పూర్తయ్యేదాకా వారు జైల్లోనే ఉండాల్సి వస్తోంది.

Sharif, Maryam to remain in jail until elections as court adjourns hearing on their appeals

పనామా ప్రతాలతో వెలుగుచూసిన అవెన్‌ఫీల్డ్‌ హౌస్‌ అవినీతి కేసులో నవాజ్ షరీఫ్‌, కూతురు మర్యంలను కోర్టు దోషులుగా తేల్చిన విషయం తెలిసిందే. దీంతో కోర్టు నవాజ్‌కు పదేళ్లు, మర్యంకు ఏడేళ్ల జైలుశిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ షరీఫ్‌, మర్యం, అల్లుడు హైకోర్టును ఆశ్రయించారు. తమను బెయిలుపై విడుదల చేయాలని విడివిడిగా మొత్తం ఏడు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ అప్పీళ్లపై కోర్టు మంగళవారం విచారణ జరిపింది.

ఈ కేసులో షరీఫ్‌, మర్యంలకు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు నో చెప్పింది. విచారణ పూర్తయ్యేంత వరకు శిక్షను నిలిపివేసేది లేదని కూడా కోర్టు తెలిపింది. జులై 25న పాకిస్థాన్‌లో ఎన్నికలు జరగనున్నాయి.

English summary
A Pakistani court today adjourned until last week of July the hearing of appeals filed by jailed former premier Nawaz Sharif, his daughter and son in law against their conviction in a corruption case, shattering their hope to come out of jail before polls to boost the campaign of their party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X