ఒకే రోజు రెండు లాటరీలు: రూ.2.5 కోట్లు గెలుచుకొన్న మహిళ

Posted By:
Subscribe to Oneindia Telugu

వాషింగ్టన్‌: అమెరికాలో ఓ మహిళకు ఒకే రోజు రెండు లాటరీల్లో భారీగా డబ్బులు వచ్చాయి.ఉత్తర కరోలినాలో ఇటీవల డైమండ్‌ డ్యాజ్లర్‌ లాటరీ టికెట్‌ను కొనుగోలు చేసిన కింబర్లీ మోరిస్‌.. రూ.6.4లక్షల నగదును గెలుచుకొంది.

ఈ మొత్తాన్ని స్వీకరించిన ఆమె.. వెంటనే రెండోసారి అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు. రూ.1300 వెచ్చించి మరో టికెట్‌ కొనుగోలు చేశారు. దీనికి రూ.6.47 కోట్ల నగదు బహుమతి తగలడంతో.. ఆమె ఆనందం పదింతలైంది.

She Won $10,000 In The Lottery. Then $1 Million - Both In One Day

విడతలవారీగా కాకుండా ఒకేసారి నగదు మొత్తాన్ని తీసుకోవాలని ఆమె నిర్ణయించుకోవచ్చని భావించి ఆమె రెండో లాటరీ టిక్కెట్టును కొనుగోలు చేసింది... పన్నులు పోనూ రూ.2.5 కోట్లు ఆమె ఖాతాకు చేరాయి. పెద్ద మొత్తాన్ని గెలుచుకుంటానని తానెప్పుడూ కల కనేదాన్నని.. అందుకే రెండో టికెట్‌ కొన్నానని కింబర్లీ చెప్పారు.

ఒకేరోజు రెండు లాటరీల్లో ఆమెకు భారీగా డబ్బులు రావడంతో ఆమెతో పాటు ఆమె కుటుంబసభ్యుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇలాంటి ఘటనలు అరుదుగా చోటుచేసుకొంటాయి.

ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
A woman in North Carolina, US picked two prize-winning lottery tickets the same day. She bought the $4,000,000 Diamond Dazzler ticket from a grocery store and won $10,000. After collecting her money from the headquarters of the lottery on Monday, Kimberly Morris stopped at a supermarket and bought another $20 lottery ticket. Perhaps, she was feeling lucky.

Oneindia బ్రేకింగ్ న్యూస్
రోజంతా తాజా వార్తలను పొందండి