VIRAL: ఆఫీస్ టాయిలెట్స్ లో కూడా కెమెరాలు.. ఛీఛీ ఆ కంపెనీ ఏం చేస్తోందంటే..?

చైనాలోని షెంజాన్ నగరానికి కు చెందిన ఓ కంపెనీ చేసిన నిర్వాకం వెంటే మీరు నోరు వెళ్లబెడతారు. కంపెనీలోని టాయిలెట్స్ లో ఉద్యోగులకు తెలియకుండా సీసీ కెమెరాలు ఫిక్స్ చేసింది. ఉద్యోగులు బాత్రూమ్ బ్రేక్స్ అని చెప్పి వెళ్తున్న క్రమంలో వాళ్లు టాయిలెట్స్ లో ఎంత టైం గడుపుతున్నారు ? తెలుసుకుని వారిపై చర్యలకు పాల్పడుతోంది. బాత్రూమ్స్ లో ఉద్యోగులు ఏం చేస్తున్నారో ఫొటోలు తీసి వాటిని టాయిలెట్స్ గోడలపై అతికించి.. చాలా సమయం టాయిలెట్స్ లో ఉన్నందుకు వాళ్లను శిక్షిస్తోంది.ఆ కంపెనీ చేస్తున్న దుశ్చర్యలు బయటకు రావడంతో చైనా వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు అలుముకున్నాయి. ప్రైవసీ ప్లేస్ గా భావించే టాయిలెట్స్ లోనూ సీసీ కెమెరాలు పెట్టడం ఏంటని సాధారణ ప్రజలు మండిపడుతున్నారు.

అయితే ఆ కంపెనీ యాజమాన్యం తాను చేసిన దుశ్చర్యను సమర్థించుకుంటోంది. ఉద్యోగులు బాత్రూమ్ బ్రేక్ అని చెప్పి చాలా సమయం తీసుకుంటున్నారు. టాయిలెట్స్ లో మొబైల్ గేమ్స్ ఆడటం, సిగరెట్లు తాగడం చేస్తున్నారు. డోర్స్ మూసేసి.. ఇతర ఉద్యోగులు వాటిని వినియోగించుకోకుండా చేస్తున్నారని సదరు కంపెనీ మండిపడుతోంది.

Shenzhen Company Faces Backlash for Installing CCTV in Office Toilets

ఉద్యోగులా.. లేక బానిసలా..

లిక్సన్ దియాన్ షెంగ్ కంపెనీపై చైనా వ్యాప్తంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఘటనపై ప్రముఖ న్యాయవాది తీవ్రంగా స్పందించారు. కంపెనీలో పనిచేస్తున్నది ఉద్యోగులా.. లేక బానిసలా అని ఆగ్రహం వ్యక్తంచేశారు. కంపెనీ యాజమాన్యంపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+