అమెరికాలో గన్‌ఫైర్: 7గురు మృతి, ఉగ్రవాదుల పనేనా?

హెస్టాన్: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన కలకలం సృష్టించింది. అమెరికాలోని కన్సాస్‌ రాష్ట్రంలోని హెస్టాన్‌ ప్రాంతంలో తాను పనిచేస్తున్న ఫ్యాక్టరీలోనే ఓ పెయింటర్ కాల్పులు జరపడంతో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందగా, ఈ ఘటనలో దాదాపు 30 మంది వరకు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా మరణించాడు. వివరాల్లోకి వెళితే... సెడ్రిక్ ఫోర్డ్ ఎక్సెల్ ఇండస్ట్రీస్‌లో పెయింటర్‌గా పనిచేస్తాడు. అతడు ఫేస్‌బుక్‌లో అసాల్ట్ రైఫిల్‌తో ఉన్న తన ఫొటోను పోస్ట్ చేశాడని స్థానికులు తెలిపారు.

Sheriff: Up to 7 dead, 20 injured in Kansas workplace shooting

అతడు ముందుగా తన కంపెనీ పార్కింగ్ లాట్‌లో ఓ మహిళను కాల్చాడు. తర్వాత అసెంబ్లీ ఏరియాలోకి ప్రవేశించి, విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. మరో ఇద్దరిని మాత్రం ఫ్యాక్టరీలోకి రాకముందే, అంటే బయటే కాల్చాడని హార్వే కౌంటీ ఆఫీస్ సూపర్ వైజర్ షెరీఫ్ వాల్టన్ స్థానిక మీడియాకు వెల్లడించారు.

కాల్పుల విషయం తెలియగానే ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ల బంధువులు అక్కడకు వెళ్లారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించారు. సెడ్రిక్ వద్ద ఒక ఏకే 47 తుపాకితో పాటు 9ఎంఎం గన్ కూడా ఉందని స్థానికులు అంటున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశాడు.

మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. అయితే కాల్పులకు తెగబడింది ఉగ్రవాదులా? కాదా? అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. కాల్పులు జరిపిన నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+