Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Elon Musk కు ఊహించని షాక్; ట్విట్టర్ చీఫ్ గా తప్పుకుంటారా?

ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ గురించి తెలియని వారు ఉండరు. ఆయన ఏది చేసినా సంచలనమే. ఇటీవల కాలంలో ఆయన చేస్తున్న ట్వీట్లు మరింత సంచలనంగా మారుతున్నాయి. ట్విట్టర్ ను తన ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ చేసిన మార్పులు అనేక సంచలనాలకు కారణంగా మారాయి. ఇక ట్విట్టర్ లోనూ ఖాతాదారుల పై భారం పెంచుతూ ఆయన సంచలనాత్మక నిర్ణయాలు చర్చనీయాంశం అయ్యాయి. బ్లూ టిక్ కి ఛార్జ్ పెంచడం వంటి నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజాగా షాకింగ్ ట్విట్టర్ పోల్ నిర్వహించిన ఎలాన్ మస్క్

తాజాగా షాకింగ్ ట్విట్టర్ పోల్ నిర్వహించిన ఎలాన్ మస్క్


అనూహ్య పరిణామాల నడుమ ట్విట్టర్ పగ్గాలు చేపట్టిన ఆయన, తాను తీసుకున్న సంచలన నిర్ణయాలతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. సంస్థ ఉద్యోగులను బయటకు పంపిన వైనం పైన, ట్విట్టర్ బ్యాన్ చేసిన వ్యక్తులను మళ్ళీ తిరిగి ఆహ్వానించడం పైన, డొనాల్డ్ ట్రంప్ పై ట్విటర్ నిషేధం ఎత్తివేత పైన ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆసక్తికరంగా మారాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. గతంలో ట్విట్టర్ బ్యాన్ చేసిన వ్యక్తులను తిరిగి ఆహ్వానించడం పై ట్విట్టర్ వేదికగా పోల్ నిర్వహించి వచ్చిన ఫలితాల ఆధారంగా నిర్ణయం తీసుకున్న ఎలన్ మస్క్ తాజాగా మరొక ట్విట్టర్ పోల్ ను చేపట్టారు.

ట్విట్టర్ సీఈవో స్థానంలో నుంచి తాను తప్పుకోవాలా? వద్దా

ట్విట్టర్ సీఈవో స్థానంలో నుంచి తాను తప్పుకోవాలా? వద్దా


ట్విట్టర్ లో ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేసి పోల్ చేపట్టిన ఎలాన్ మస్క్ అందులో వేసిన ప్రశ్న ఇప్పుడు నెట్టింట హల్ చల్ చేస్తోంది. ట్విట్టర్ కొత్త బాస్ ఎలాన్ మస్క్ తాను తీసుకున్న నిర్ణయాలపై విమర్శలు వెల్లువగా మారడంతో ఏకంగా తన పైనే ట్విట్టర్ పోల్ నిర్వహిస్తున్నారు. ట్విట్టర్ సీఈవో స్థానంలో నుంచి తాను తప్పుకోవాలా? వద్దా ? మీ అభిప్రాయం చెప్పండి అంటూ? పోల్ మొదలుపెట్టారు. పోల్ లో వెల్లడైన అభిప్రాయానికి తాను కట్టుబడి ఉంటానని, సీఈవో స్థానం నుంచి మీరు తప్పుకోమంటే తప్పకుంటానని ఎలాన్ మస్క్ ప్రకటించారు.

 ఎలాన్ మస్క్ కు షాక్ ఇచ్చిన ట్విట్టర్ యూజర్లు

ఎలాన్ మస్క్ కు షాక్ ఇచ్చిన ట్విట్టర్ యూజర్లు


అయితే ఈ రోజు ఉదయం వరకు ఈ పోల్ లో 56 శాతం మంది ఎలాన్ మస్క్ తప్పుకోవాలని ఓట్లు వేయగా, 44 శాతం మంది సంస్థ సీఈవో గా మస్క్ కొనసాగాలని అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి మెజారిటీ ఓటర్లు సీఈఓ గా ఎలాన్ మస్క్ తప్పుకోవాలని అభిప్రాయం వ్యక్తం చేయడంతో, ఆయన నిజంగానే ట్విట్టర్ సీఈఓ గా వైదొలుగుతారా? ఆయన ఏం చేయబోతున్నారు అన్నది ప్రస్తుత ఆసక్తికర చర్చకు కారణం గా మారింది.

 సంచలనాలకు కేరాఫ్ మస్క్ ఏం చేస్తాడో?

సంచలనాలకు కేరాఫ్ మస్క్ ఏం చేస్తాడో?


సీఈఓ గా ట్విట్టర్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తీసుకున్న నిర్ణయాలతో అసహనం లో ఉన్న చాలామంది ఎలాన్ మస్క్ పై మండి పడుతున్నారు. ఇక మీరు చేసిన అరాచకాలు చాలు.. దయచేసి వైదొలగాలి అని కొందరు కామెంట్లు చేస్తుంటే, ట్విట్టర్ తో ఆటలు ఆడుకుండా తొందరగా తప్పుకోవాలని మరి కొందరు కామెంట్ చేస్తున్నారు. మొత్తానికి తనపై తానే స్టార్ట్ చేసిన ట్విట్టర్ పోల్ మస్క్ కు ఊహించని షాక్ ఇచ్చినట్టు కనిపిస్తుంది. మరి ఈ అపర కుబేరుడు.. సంచలనాలకు కేరాఫ్ అయిన మస్క్ ఏం చేస్తారు అన్నది ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తున్న అంశం.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+