8 మంది గ్యాంగ్ రేప్: ఆమెను కర్రలతో కొడుతారట
ఇండోనేషియా: ఇండోనేషియాలో అత్యంత దురదృష్టకరమైన, దిగ్భ్రాంతికరమైన సంఘటన చోటు చేసుకుంది. అక్రమ సంబంధం కలిగి ఉందనే ఆరోపణపై ఎనిమిది పురుషులు ఓ మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పైగా, ఇస్లామిక్ చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణపై ఆమెను బహిరంగంగా కర్రలతో కొట్టే శిక్ష విధించే అవకాశం ఉంది.
ఓ వివాహితుడితో తన ఇంట్లో అతనితో పాటు ఉన్నందుకు ఎనిమిది తనపై సామూహిక అత్యాచారం చేశారని పాతికేళ్ల ఆ విధవరాలు చెప్పింది. ఆమెతో పాటు ఉన్న వ్యక్తిని వారు కొట్టారు. వారిని ఆ తర్వాత పోలీసులకు అప్పంగించారు.

ఈ దాడి గురువారంనాడు లోక్బానీ గ్రామంలో జరిగింది. ఆ విధవను, ఆ వ్యక్తిని మత చట్టాలను ఉల్లంఘించినందుకు నాలుగు సార్లు కర్రలతో కొట్టాలని జిల్లా ఇస్లామిక్ షియా చట్టు అధిపతి ఇబ్రహీం లతీఫ్ ఆదేశించారు.
మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడినవారిలో ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరో ఐదుగురి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.












Click it and Unblock the Notifications