"మానవ మలాన్ని తిన్నారు.. మనుషుల మాంసాన్ని వీధుల్లో అమ్మారు"

తినడానికి తిండే దొరకని పరిస్థితుల్లో.. గడ్డిని, మానవ మలం, కుక్కులు, పిల్లులు, ఇలా ఏది దొరికితే అది వారికి ఆహారంగా మారింది.

మాస్కో: 1920వ దశకంలో ఆకలితో రష్యా అలమటించిన తీరు అత్యంత దిగ్భ్రాంతికరం. మానవ చరిత్రలో చోటు చేసుకున్న అతి విషాదకరమైన ఘటనల్లో రష్యాలో 'నరమాంస భక్షణ' ఒకటని చెప్పుకోవాలి.

ఎటూ చూసిన కరువు.. ఓల్గా, ఓరల్ నదులు ఎండిపోవడంతో.. నదీ పరివాహక ప్రాంతాల్లో తీవ్ర దుర్భిక్షం నెలకొంది. ప్రభుత్వ అసమర్థత అక్కడి ప్రజలకు మరింత శాపంగా మారడంతో.. ఆకలి రోదనకు తట్టుకోలేక.. ఆఖరికి మలాన్ని సైతం తిన్న పరిస్థితి. మొదటి ప్రపంచ యుద్దం తర్వాత రష్యా ఆకలితో అలమటించిన తీరుకు ఇదొక నిదర్శనం.

తినడానికి తిండే దొరకని పరిస్థితుల్లో.. గడ్డిని, మానవ మలాన్ని, కుక్కుల్ని, పిల్లుల్ని, ఇలా ఏది దొరికితే అది వారికి ఆహారంగా మారింది. ఆఖరికి కడుపున పుట్టిన బిడ్డల్నే చంపుకుతిన్నవారు కూడా లేకపోలేదు. ఆకలి వారితో చేయించిన హత్యలవి. ప్రభుత్వం కూడా నిస్సహాయంగా చూస్తుండిపోయిందే తప్ప.. ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

Shocking images reveal the deprivation suffered by peasants forced to eat HUMANS during the 1920s Russian famine

వీధుల్లో పిల్లల తలలను, శరీర భాగాలను అమ్మకానికి పెట్టిన అప్పటి ఫోటోలు మరోసారి వెలుగుచూశాయి. కడు దారిద్ర్యంలో అతి ఘోరాతి ఘోరమైన పరిస్థితులను అప్పటి రష్యా ప్రజలు ఎదుర్కొన్నారు.

చివరకు అమెరికా, యూరోప్ దేశాల కొంత చేయూతను అందించడంతో.. లక్షలాది మంది ప్రజలు ఆకలి మరణాల నుంచి బయటపడ్డారు. 1921-1922 మధ్య నెలకొన్న ఈ పరిస్థితుల కారణంగా దాదాపు 5లక్షల మంది ప్రజలు చనిపోగా.. 30లక్షల మంది ప్రజలు పోషకాహార లేమితో బాధపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+