Kenya cult:ఆ పాస్టర్ తొలి టార్గెట్ చిన్న పిల్లలే.. వెలుగులోకి వస్తున్న షాకింగ్ నిజాలు
Kenya cult:ఉపవాసం చేసి మరణిస్తే జీసస్ దగ్గరకు త్వరగా చేరుకుంటారని పాల్ మెకంజీ అనే చర్చి పాస్టర్ బోధన విని దాదాపుగా 200కు పైగా మృతి చెందిన ఘటన కెన్యాలో చోటుచేసుకున్న విషయం తెలిసిందే. మృతి చెందిన వారిని అడవిలో పూడ్చడం ఆ తర్వాత అక్కడ మృతదేహాలు గుట్టలు గుట్టలుగా బయటపడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు. విచారణలో పలు నివ్వెరపోయే నిజాలు బయటపడ్డాయి.
పోలీసుల విచారణకు సహకరిస్తున్న పాల్ మెకంజీ అనుచరుడు టైటస్ కటానా పలు విషయాలను వెల్లడించాడు. ముందుగా చిన్నారులను చంపేవారని చెప్పాడు. వారిని ఎర్రటి ఎండలో ఉపవాసం ఉండాల్సిందిగా ఆదేశాలు ఇచ్చేవారని అలా చేస్తే పిల్లలు త్వరగా మృతి చెందేవారని చెప్పాడు. ఆ తర్వాత మహిళలు, ఆపై పురుషులను ఇలా చేయమని పాస్టర్ పాల్ మెకెంజీ చెప్పేవాడని టైటస్ వివరించాడు. ఇలా ఆదేశాలు ఇచ్చిన వెంటనే వారిని ఐదు రోజుల పాటు గుడిసెలో బంధించి ఆహారం నీళ్లు ఇచ్చేవారు కాదని చెప్పారు.

ఇలా ఆదేశాలు ఇచ్చిన వెంటనే వారిని ఐదు రోజుల పాటు గుడిసెలో బంధించి ఆహారం నీళ్లు ఇచ్చేవారు కాదని చెప్పారు.ఐదు రోజుల తర్వాత చిన్నారులను దుప్పట్లలో చుట్టేసి అడవిలో పాతిపెట్టేవారని చెప్పాడు. అందులో కొందరు ఇంకా కొన ఊపిరితో ఉండే చిన్నారులు కూడా ఉండేవారని వెల్లడించాడు.
ఇక మృతదేహాలను వెలికితీసిన అధికారులు పోస్టుమార్టం చేయించారు. వీరంతా ఆకలికి అలమటించి, సరైన గాలి లేక చనిపోయారని రిపోర్ట్ వెల్లడించింది. కొందరిపై గాయాలు ఉన్నట్లు రిపోర్ట్ పేర్కొంది. మరో 600 మంది ఆచూకీ ఇంకా దొరకలేదని అధికారులు చెప్పారు. అయితే పాస్టర్ మెకెంజీని విచారణ చేయగా అతను ఎవరినీ ఉపవాసం ఉండాల్సిందిగా బలవంతం చేయలేదని తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆయన్ను అరెస్టు చేసిన పోలీసులు కోర్టులో హాజరుపర్చగా కోర్టు అతనికి బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది.












Click it and Unblock the Notifications