వైరల్ వీడియో: అల్లుడా మజాకా.. తల్లీకూతుళ్లు ఒకేసారి ప్రెగ్నెంట్..!

సోషల్ మీడియా ప్రభావం కారణంగా ప్రపంచంలో జరిగే వింతలు, విశేషాలు మన కళ్ల ముందుకు వస్తున్నాయి. ఈ వీడియో చూస్తే మానవ సంబంధాలు ఎంతలా క్షీణించిపోయాయో అర్థమైపోతుంది. ఈ ఘటన అమెరికాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజెన్లు పలు రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

అమెరికాలో ఓ మహిళ, ఆమె కూతురు ఒకే వ్యక్తి కారణంగా గర్భం దాల్చారు. వారిద్దరూ ఒకే వారంలో తమ పిల్లలకు జన్మనివ్వబోతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమమైన ఇన్‌ స్టాగ్రామ్‌ లో వైరల్ అవుతోంది. ఈ వైరల్ వీడియోను జాడే టీన్(22) అనే యువతి తన @xojadeteen అనే సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేసింది. ఈ వీడియోలో ఆమె తల్లి డానీ స్వింగ్స్ కూడా ఉంది. ఇద్దరూ ప్రెగ్నెన్సీతో కనిపించారు.

తనతో పాటు తన తల్లి ఒకే వ్యక్తి కారణంగా గర్భం దాల్చామని.. తమ పిల్లల పుట్టుక కేవలం వారం రోజుల వ్యవధి మాత్రమేనని అని పోస్టు చేసింది జాడే టీన్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఇప్పటి వరకు 75 లక్షలకు పైగా వ్యూస్ సాధించింది.

Shocking US Family Drama Mom and Daughter Both Pregnant by the Same Man Viral Video Exposes All

జాడే టీన్ తల్లి డానీ స్వింగ్స్ కు ప్రస్తుతం 44 ఏళ్లు. ఆమె జాడేకు జన్మనిచ్చిన కొద్ది కాలానికే భర్తతో విడాకులు తీసుకుంది. ఆ తర్వాత డానీ.. నికోలస్ యార్డి(22) అనే వ్యక్తితో రిలేషన్ లో ఉంది. ఇద్దరూ కొంతకాలం డేటింగ్ చేసి తర్వాత ఒకటయ్యారు. డానీ కుమార్తె జాడే కూడా వారితోపాటు అదే ఇంట్లో ఉండేది. అయితే నికోలస్ డానీతో పాటు ఆమె కూతురు జాడేకు కూడా దగ్గరయ్యాడు. తల్లితోపాటు బిడ్డతోనూ ప్రేమాయణం నడిపించాడు. ప్రస్తుతం ఇద్దరూ గర్భం దాల్చారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+