మీ దేశానికి వెళ్లిపో అంటూ భారత యువతిపై అత్యాచారం.. ఎక్కడంటే..?
సాధారణంగా చదువు, ఉద్యోగాలు, ఉపాధి, టూరిజం అంటూ ఏటా వేల మంది భారత్ నుంచి వివిధ దేశాలకు వెళ్తుంటారు. ముఖ్యంగా అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలకు భారత పౌరులు ప్రయాణిస్తుంటారు. అయితే ఇతర దేశాల నుంచి వచ్చిన యువతీ యువకులపై అక్కడి ప్రజలకు కొంత అసూయ, కోపం ఉంటుంది. ఈ క్రమంలో అమెరికాలో భారతీయులపై చాలా ఘటనలే జరిగాయి. అయితే తాజాగా ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన బ్రిటన్ లో జరిగింది. ఓ సిక్కు మహిళకు అక్కడ ఊహించని పరిణామం ఎదురైంది. ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు.
బ్రిటన్ లో సిక్కు మహిళపై దారుణానికి పాల్పడ్డారు ఇద్దరు దుర్మార్గులు. నీ స్వదేశానికి వెళ్లిపో అని బెదిరిస్తూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. తనపై దారుణానికి పాల్పడిన సమయంలో మీ దేశానికి తిరిగి వెళ్లిపోండి అంటూ హెచ్చరించారని పోలీసులకు తెలిపింది బాధితురాలు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఇక ఈ వ్యవహారంపై బ్రిటన్ లోని సిక్కు సమాజం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

ఈ ఘటనపై పోలీసులు స్పందించారు. కేసు నమోదు చేశామని నిందితులకోసం గాలింపు చర్యలు ముమ్మరం చేసినట్లు తెలిపారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా అత్యాచారానికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులు శ్వేతజాతీయులే అని స్పష్టం అయిందని తెలిపారు. వారిలో ఒకరు గుండుతో భారీ శరీరంతో ఉండగా మరొకరు ముదురు రంగు స్వెట్ షర్ట్ ధరించి ఉన్నారని తెలిపారు. వీలైనంత వేగంగా నిందితులను పట్టుకుంటామని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications