గ్రీస్‌లో రెండు పడవలు మునక: 21 మంది మృతి
గ్రీక్ ఐస్‌లాండ్: గ్రీస్‌లో శుక్రవారం వరుసగా రెండు పడవలు మునిగిపోవడంతో 21 మంది శరణార్ధులు మృతిచెందారు. గ్రీస్ పోర్ట్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. టర్కీ నుంచి బయలుదేరిన పడవ గ్రీస్‌లోని ఫార్మాకోనిసి ద్వీపంలో రాయిని ఢీకొని మునిగిపోగా మరో పడవ కలోలిమ్నస్ ద్వీపంలో మునిగిపోయింది.
మునిగిన రెండు పడవల్లో 38 మంది శరణార్ధులు ప్రాణాలతో బయటపడ్డారు. తీరప్రాంత అధికారులు ఇప్పటివరకు ఆరు చిన్నారులు, ఓ మహిళ మృతదేహాన్ని వెలికితీశారు. గల్లంతైన వారికోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

మధ్య ప్రాచ్యంలో నెలకొన్న పరిస్థితుల కారణంగా పలువురు సిరియా, టర్కీ తదితర దేశాల నుంచి గ్రీస్ వలసవెళ్తుంటారు. ఇప్పటివరకు 31,000 మంది సముద్ర ప్రయాణాల ద్వారా గ్రీస్‌కి చేరుకున్నట్లు ఐఓఎం(ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ మైగ్రంట్స్) వెల్లడించింది.












Click it and Unblock the Notifications