Nepal Gen Z protest: సోషల్ బ్యాన్ పై భగ్గుమన్న నేపాల్-నిరసనల్లో ఆరుగురు మృతి..!

హిమాలయ ఖండ దేశం నేపాల్ లో ప్రభుత్వ అవినీతి, సోషల్ మీడియాలో దానిపై చర్చ జరగకుండా విధించిన నిషేధం దేశవ్యాప్త నిరసనలకు దారి తీశాయి. జెన్ జీ ఆగ్రహంతో హింసాత్మకంగా మారిన నిరసనలను అదుపు చేసేందుకు పోలీసులు చేసిన ప్రయత్నంలో ఆరుగురు పౌరులు చనిపోయారు. దాదాపు 100 మందికి పైగా గాయాలపాలయ్యారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు చోటు చేసుకుంటున్నాయి.

నేపాల్ లో అధికారంలో ఉన్న కేపీ శర్మ ఓలీ ప్రభుత్వంలో అవినీతి, బంధుప్రీతి పెరిగిపోవడం, ఉపాధి లేకపోవడం వంటి కారణాలతో యువతలో నైరాశ్యం నెలకొంది. అదే సమయంలో వీటిపై సోషల్ మీడియాలో చర్చ జరగకుండా ప్రభుత్వం ఏకంగా
26 యాప్స్ ను నిషేధం విధిస్తూ తీసుకున్న నిర్ణయం మొత్తం వివాదానికి ఆజ్యం పోసినట్లయింది. దీంతో యువత రోడ్లపైకి వచ్చారు. జెన్ జడ్ విప్లవం పేరుతో బ్యానర్లు పట్టుకుని రూడ్లపై నిరసన ర్యాలీలు చేపట్టారు.

Social Media Ban Sparks Massive Gen Z Protest in Nepal 6 Dead 80 Hurt in Police Firing

సోషల్ యాప్స్ పై నిషేధాన్ని ప్రభుత్వం నియంత్రణ నిబంధనలకు అనుగుణంగా ప్రకటించినప్పటికీ.. నిరసనకారులు మాత్రం దీనిని విమర్శనాత్మక స్వరాలను , వ్యవస్థీకృత భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి ఉద్దేశించిన ప్రత్యక్ష సెన్సార్‌షిప్ చర్యగా అభివర్ణిస్తూ ఆందోళనలకు దిగారు. ప్రభుత్వం ఫోన్ , ఇంటర్నెట్ లను నిషేధించడంతో జెన్ జీ యువకులు టిక్‌టాక్ , రెడ్డిట్ వంటి ప్రత్యామ్నాయ వేదికల వైపు మళ్లారు. వేలాది మంది యువ ప్రదర్శనకారులు గుమిగూడి, ప్రభుత్వానికి, దాని విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ మార్చ్ మైతిఘర్ మండల వద్ద ప్రారంభమై పార్లమెంట్ భవనం వైపు సాగింది.

దీంతో పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించారు. ఎక్కడికక్కడ బ్యారికేడ్లు పెట్టి నిరసనకారుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా యువత మాత్రం వెనక్కి తగ్గడం లేదు. దీంతో పోలీసులు వాటర్ క్యానన్లు, టియర్ గ్యాస్ ప్రయోగాలు కూడా చేశారు. దీంతో రెచ్చిపోయిన నిరసనకారులు పోలీసులపై వాటర్ బాటిల్స్ విసిరారు. ఈ దాడులు, ప్రతిదాడుల్లో ఆరుగురు నిరసనకారులు చనిపోయారు. మరో 80 మందికి పైగా గాయపడ్డారు. ప్రభుత్వం మాత్రం సోషల్ మీడియా బ్యాన్ ను సమర్ధించుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+