సెల్ సిగ్నళ్లు అందట్లేదా..జీపీఎస్ వర్క్ కావట్లేదా: కారణం ఇదే: సెకెనుకు 500 కి.మీ వేగంతో
వాషింగ్టన్: ఊహించని వేగంతో సౌర తుఫాన్ భూమి వైపు దూసుకొస్తోంది. దీని వేగాన్ని ఏ మాత్రం ఊహకు కూడా అందదు. గంటకు 1.6 మిలియన్ల కిలోమీటర్లు. ఈ తుఫాన్ ఏ క్షణమైనా భూమిని తాకవచ్చు. ప్రత్యేకించి- మంగళ, బుధవారాల్లో భూ వాతావరణాన్ని ఇది ప్రభావితం చేస్తుందని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ.. నాసా అంచనా వేసింది. భూ వాతావరణంపై పొరలను ఇది తాకుతుందని భావిస్తోన్నారు. సౌర తుఫాన్ ప్రభావం ఉపగ్రహాలపై పడే అవకాశాలు ఉన్నాయి. ఫలితంగా- జీపీఎస్, సెల్ ఫోన్ సిగ్నళ్లు, ఇంటర్నెట్ వంటి సేవలు స్తంభించవచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఈ నెల 3వ తేదీన సూర్యుడిలో సంభవించిన తీవ్ర విస్ఫోటనం వల్ల ఈ సౌర తుఫాన్ ఏర్పడినట్లు నాసా శాస్త్రవేత్తలు వెల్లడించారు. దీని వేగం సెకెనుకు 500 కిలోమీటర్లుగా ఉంటుందని స్పేస్ వెదర్ అనే వెబ్‌సైట్ పేర్కొంది. ఇదివరకు కూడా తరఫు ఇలాంటి సౌర తుఫాన్లు సంభవించినప్పటికీ.. వాటి తీవ్రత పరిమితంగా కనిపించిందని, ఈ సారి మాత్రం భిన్న పరిస్థితులు నెలకొన్నట్లు తెలిపింది. సెకెనుకు 500 కిలోమీటర్ల వేగంతో ఈ సౌర తుఫాన్ సూర్యుడి నుంచి వెలువడిందని, క్రమంగా ఇది తన వేగాన్ని మరింత పెంచుకుని గంటకు 1.6 మిలియన్ల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుందని స్పష్టం చేసింది.

సూర్యుడి నుంచి పూర్తిస్థాయి జియో మాగ్నటిక్ వెలువడిందని నాసా తెలిపింది. భూ ఉపరితల వాతావరణాన్ని ఈ తుఫాన్ ప్రభావితం చేస్తుందని, జీపీఎస్ నేవిగేషన్లు, మొబైల్ ఫోన్ సిగ్నళ్లు, శాటిలైట్ టీవీలు, పవర్ గ్రిడ్స్ స్తంభించిపోయే అవకాశం ఉందని అంచనా వేసింది.
ఈ సౌరతుఫాన్ భూ అయస్కాంత క్షేత్రాన్ని ప్రభావితం చేయడం వల్ల ఈ బ్లాక్ అవుట్స్ ఏర్పడతాయని తెలిపింది. ఈ తుఫాన్ భూ వాతావరణంలోకి ప్రవేశిస్తున్న సమయంలో ఉత్తర, దక్షిణ ధ్రువాల్లో నివసించే వారికి ఖగోళ కాంతిని వీక్షించే అవకాశం లభిస్తుందని తెలిపారు. ఈ సౌర తుఫాన్‌ను శాస్త్రవేత్తలు ఎక్స్1 కేటగిరీగా నిర్ధారించారు. అత్యంత శక్తిమంతమైన వాటిని ఈ కేటగిరిలో చేర్చుతారు.












Click it and Unblock the Notifications