వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఐఎస్ నేత బగ్దాదీ పిలుపు: ముస్లింల స్పందన ఇలా

|
Google Oneindia TeluguNews

బాగ్దాద్/న్యూయార్క్: ఇటీవల ఐఎస్ఐఎస్ అగ్రనేత అబు బాకర్ అల్ బగ్దాదీ ఇచ్చిన పిలుపునకు ప్రపంచంలోని ముస్లింల నుంచి వచ్చిన స్పందన ఆసక్తికరంగా మారింది. ముస్లింల స్పందనకు ఆ నేతకు దిమ్మదిరిగి పోయుంటుంది. ఆ విధంగా ఉన్నాయి మరి వారి స్పందనలు.

ఇప్పటికే ఇరాక్‌లో పట్టుకోల్పోయిన ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు ఈ స్పందన మరింత బాధకు గురి చేసుంటుంది. ఐఎస్ ఆధీనంలో ఉన్న రమాది ఇప్పటికే ఇరాకీ భద్రతా దళాలు తిరిగి స్వాధీనం చేసుకున్నాయి.

ఐఎస్ఐఎస్‌పై యుద్ధం చేయడమంటే ఇస్లాం, ముస్లింలపై యుద్ధం చేయడమేనని ఆ ఐఎస్ నేత ఆడియో టేప్‌ను విడుదల చేశాడు. ప్రపంచమంతా తమకు వ్యతిరేకంగా ఉందని, తామంతా కలిసి పోరాటం చేయాలని అందులో పేర్కొన్నాడు. అనంతరం ఇయాద్ ఇల్ బగ్దాదీ అనే కార్యకర్త ఆ ఆడియోను ఇతర భాషల్లోకి అనువదించారు.

ఈ నేపథ్యంలో ప్రపంచంలోని ముస్లింలు ఐఎస్ ఉగ్రవాదులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో వారిపై సందేశాలు, సమాధానాలతో దండెత్తారు. కొందరు తాము ఫుట్‌బాల్ చూడాలని సమాధానమివ్వగా, మరికొందరు తమ తల్లిదండ్రులు చాలా క్రమశిక్షణగా ఉంటారని, అందుకే సమయానికి ఇంటికెళ్లాలని బదులిచ్చారు.

ఇంకొందరు తాము చూడాల్సిన ఇష్టమైన టీవీ సిరీస్, సినిమాలు కోల్పోవాల్సి వస్తుందని సమాధానమిచ్చారు. మరికొందరు ఇంతకంటే ఉత్తమమైన కారణాలు తెలుపుతూ వారికి జవాబిచ్చారు.

English summary
Recently, ISIS top leader Abu Bakr al-Baghdadi made a call to Muslims around the world to join Daesh, and it was turned down with the most genuine (read as hilarious) excuses on Twitter.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X