ఆ వెబ్‌సైట్‌నే నమ్ముకున్న "ఇజ్రాయెల్" ప్రజలు.. ఏ పని అయినా ఆ తర్వాతే ??
మిడిల్ ఈస్ట్ లో అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్నారు. ఇరాన్ -ఇజ్రాయెల్ మధ్య భీకర పోరు నడుస్తుంది. అయితే ఇజ్రాయెల్ ప్రజలు స్నానం చేయాలంటే మాత్రం.. ఒక ప్రత్యేకమైన వెబ్ సైట్‌లో టైమ్ చెక్ చేసుకుని స్నానానికి వెళ్తున్నారట. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా కూడా ఇది నిజమని చెప్తున్నారు. ఇరాన్ దేశంపై ఇజ్రాయెల్, అమెరికా దాడులు చేస్తుంటే.. మరోవైపు ఇరాన్ కూడా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై క్షిపణులతో విరుచుకుపడుతోంది. ఈ క్రమంలోనే బాంబుల నుంచి తప్పించుకోవాలంటే ప్రజలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి ఇజ్రాయెల్ లో నెలకొంది. దీంతో వారు టెక్నాలజీని తమకు అనుకూలంగా మార్చుకున్నారు.
ఏ వెబ్ సైట్..
ఇరాన్ నుంచి దూసుకొస్తున్న క్షిపణుల నుంచి తప్పించుకునేందుకు.. సైరన్ మోగగానే ఇజ్రాయెల్ ప్రజలు వెంటనే షెల్టర్లకు చేరుకుని ప్రాణాలు కాపాడుకుంటున్నారు. మరీ ముఖ్యంగా రియల్ టైమ్ రిస్క్ ఎసెస్‌మెంట్ అనే టూల్ ద్వారా వారు ఆ సమయానికి స్నానానికి వెళ్లొచ్చా లేదా అని చెక్ చేస్తున్నారట. అందులోని మీటర్ రిస్క్ తక్కువగా, గ్రీన్ మార్క్ చూపిస్తే స్నానానికి వెళ్తూ.. రెడ్ మార్క్ చూపిస్తే 50 శాతం మిస్సైల్ దాడి జరగవచ్చనే హెచ్చరికగా భావిస్తున్నట్టు సమాచారం. అంతే కాకుండా బాత్రూమ్‌లో ఎంతసేపు ఉండాలి ? క్షిపణి దూసుకొస్తే? ఏం చేయాలి అనే సందేహాలకు కూడా ఈ వెబ్ సైట్‌లో జవాబులు దొరుకుతున్నాయని అంటున్నారు.

కాగా ఈ టూల్‌ను ఇజ్రాయెల్‌కు చెందిన మ్యాటన్ ఎల్హ్యానీ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి దీన్ని తయారు చేసినట్టు చెబుతున్నారు. ఇంట్లో మామూలుగా ఉన్నప్పుడు సైరన్ మోగితే సురక్షిత ప్రాంతాలకు వెళ్లి తలదాచుకోవచ్చు. కానీ స్నానం, మలమూత్రాలకు వెళ్లినప్పుడు.. సైరన్లు మోగితే వెంటనే తప్పించుకోలేరని అందుకే ఈ టూల్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్టు ఎల్హ్యానీ వెల్లడించారు.
అయితే దీన్ని నూరు శాతం నమ్మొద్దన్ని, కాస్త లక్‌ను కూడా నమ్ముకోండి అని చెబుతున్నాడు. మరోవైపు సైరన్లు మోగిన కొన్ని సెకన్ల వ్యవధిలో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లి ప్రాణాలు కాపాడుకోవాలని ప్రభుత్వం సూచిస్తుంది.
-
ట్రంప్ మాటలు నమ్మొద్దు.. యుద్ధం కొనసాగుతోంది: ఇరాన్ సంచలనం -
కుప్పకూలుతున్న అమెరికా ఫైటర్ జెట్స్.. వెనక్కు తగ్గిన ట్రంప్..!! -
లష్కరే తోయిబా ఉగ్రవాది హత్య.. చంపేసింది సొంత కుటుంబ సభ్యులే! -
ఇజ్రాయెల్ కు షాకిచ్చిన ట్రంప్, ఇప్పుడు ఏం చేద్దాం? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
విజయ్ ప్రభంజనం. 32 శాతం ఓట్లతో దూసుకుపోతున్న దళపతి! -
సీరియల్లో అలా.. సోషల్ మీడియాలో ఇలా.. బ్యూటీ పిక్స్ వైరల్ !! -
స్టేడియం ఖాళీ.. కుర్చీలు ఫుల్! పీఎస్ఎల్ అంటే ఇదేనా నాయనా?












Click it and Unblock the Notifications