Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కేంద్ర బిందువుగా..!!

అయిదువారాల పాటు ఏకధాటిగా కొనసాగిన ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధానికి తాత్కాలిక విరామం లభించింది. రెండు వారాల పాటు సీజ్ ఫైర్ కు ఆయా దేశాలు అంగీకరించాయి. ఆ వెంటనే దౌత్య ప్రయత్నాలు ప్రారంభం అయ్యాయి. ఇరాన్ పాకిస్తాన్ ద్వారా అమెరికాకు పంపిన 10 సూత్రాల ప్రతిపాదనపై ఈ నెల 10న ఇస్లామాబాద్‌లో ఇరు పక్షాలు చర్చించనున్నాయి. పాకిస్తాన్ మధ్యవర్తిత్వంతో చర్చలకు రంగం సిద్ధమైందని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ తెలిపింది.

ఈ సందర్భంగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సమాచారం అనేక ఊహాగానాలను రేకెత్తించింది. ఈ పోస్ట్‌కు సంబంధించిన డ్రాఫ్ట్ వెర్షన్ కనిపించిందని యూజర్లు పేర్కొనడమే దీనికి కారణం. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన దాడులను వాయిదా వేసి, దౌత్యానికి మరింత సమయం ఇవ్వాలని కోరుతూ షెహబాజ్ షరీఫ్ మంగళవారం తన ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేసిన పోస్ట్ అది.

Speculation Mounts Over Draft Version of Pakistan PM Iran Plea Fuel Theories of External Scripting

ఇందులో "Draft - Pakistan's PM Message on X అనే అక్షరాలు కనిపించాయి. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తొలుత కనిపించిన ఈ పదాలు ఆ తర్వాత డిలెట్ అయ్యాయి. ఇది అనేక ప్రశ్నలను లేవనెత్తింది. దీన్ని పాకిస్తాన్ ప్రధాని తన ప్రొఫైల్ నుంచి నేరుగా పోస్ట్ చేయలేదనే చర్చకు దారితీసింది. డ్రాఫ్ట్ వెర్షన్‌లో "పాకిస్తాన్ ప్రధానమంత్రి" అని థర్డ్ పర్సన్ ప్రస్తావన ఉండటం గమనార్హం.

షెహబాజ్ షరీఫ్ లేదా ఆయన అధికారులు నేరుగా ఈ పోస్ట్‌ను రూపొందించి ఉంటే ఇలా తమ గురించి తాము మూడవ వ్యక్తిగా పేర్కొనడం అసంభవం. ఈ ప్రత్యేకమైన సెంటెన్స్- ఈ పోస్ట్ వెనుక బయటి వర్గాల ప్రమేయం ఉందని సూచిస్తోందని, అనేక అనుమానాలకు తావిచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. దీని వెనుక విదేశీ వ్యక్తులు లేదా సంస్థల ప్రమేయంతో ఈ సందేశాన్ని రూపొందించి ఉండవచ్చని ఊహాగానాలు తలెత్తాయి.

ఈ పోస్ట్ ను అమెరికా లేదా ఇజ్రాయెల్‌ రూపొందించి ఉండొచ్చనే వాదనలు సైతం లేకపోలేదు. ఈ పోస్ట్ మొత్తం ఆంగ్లంలో ఉండటం, ఉర్దూ అక్షరాలు ఎక్కడే గానీ లేకపోవడం, డ్రాఫ్ట్ లేబుల్ వంటివి చూస్తోంటే పాకిస్తాన్ అధికారికంగా దీనిని రూపొందించలేదన అనుమానాలకు మరింత బలాన్ని ఇచ్చినట్టయింది. తుది వెర్షన్‌లో మాత్రం దీన్ని సరిదిద్దారు. ఈ వివాదం ఇరాన్‌కు సంబంధించిన తీవ్ర ఉద్రిక్తతల మధ్య చోటు చేసుకుంది.

అప్‌డేట్ చేసిన ట్వీట్ లో- మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధానికి శాంతియుత పరిష్కారం కోసం దౌత్య ప్రయత్నాలు స్థిరంగా, బలంగా, శక్తివంతంగా పురోగమిస్తున్నాయని రాసుకొచ్చారు. ఇది భవిష్యత్తులో గణనీయమైన ఫలితాలకు దారితీసే అవకాశం ఉందని, దౌత్య చర్చల కోసం గడువును రెండు వారాలు పొడిగించమని తాను ట్రంప్‌ను హృదయపూర్వకంగా అభ్యర్థిస్తున్నానని షరీఫ్ పేర్కొన్నారు. పాకిస్తాన్ పూర్తి చిత్తశుద్ధితో ఇరాన్ సోదరులను సద్భావన చర్యగా రెండు వారాల పాటు హోర్ముజ్ జలసంధిని తెరవాలని అభ్యర్థిస్తోన్నామని అన్నారు.

ఈ ప్రాంతంలో దీర్ఘకాలిక శాంతి, సుస్థిరత కోసం యుద్ధాన్ని ముగించడానికి, దౌత్యం ద్వారా ఆశించిన విధంగా తుది ఫలితాలను సాధించడానికి రెండు వారాల పాటు కాల్పుల విరమణ పాటించాలని తాను కోరుతున్నామని షరీఫ్ తెలిపారు. దీని తర్వాతే సీజ్ ఫైర్ కు ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ అంగీకరించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+