వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

338కి చేరిన పెట్రోల్ ధర: శ్రీలంకలో నిరసనకారులపై పోలీసుల కాల్పులు, ఒకరు మృతి,12 మందికి గాయాలు

|
Google Oneindia TeluguNews

కొలంబో: శ్రీలంక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆకాశన్నంటుతున్న ధరలకు వ్యతిరేకంగా ప్రజలు దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. కాగా,
ఆర్థిక సంక్షోభానికి ప్రభుత్వమే కారణమంటూ జరుగుతున్న నిరసనల్లో తొలిసారి హింస చెలరేగింది. ఆందోళనకారులపై పోలీసులు కాల్పులు జరపగా.. ఒకరు మరణించారు. 12 మంది గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ కెగల్లె ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు వెల్లడించారు.

శ్రీలంక రాజధాని కొలంబో నగరానికి 95 కిలోమీటర్ల దూరంలోని రాంబుక్కనలో ఈ ఘటన జరిగింది. ఇంధన కొరత, అధిక ధరలను నిరసిస్తూ అనేక మంది రెైల్వే ట్రాక్​ను దిగ్బంధించారు. కొన్ని చోట్ల పట్టాలను తొలగించారు. దీంతో నిరసనకారులను చెదరగొట్టేందుకు ప్రయత్నించిన పోలీసులపై కొందరు రాళ్ల దాడి చేశారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి మొదట టియర్ గ్యాస్ వాడామని.. అనంతరం కాల్పులు జరిపామని పోలీసులు తెలిపారు.

Sri Lanka crisis: One Dead, 12 Injured After Police Open Fire At Anti-Govt Protesters

కాగా, శ్రీలంకలో ఇంధన ధరలూ భగ్గుమంటున్నాయి. ఈ దేశంలో లీటర్ పెట్రోల్ ధర ప్రస్తుతం శ్రీలంక రూ.338కు చేరింది. అక్కడి చమురు విక్రయ సంస్థ లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ (ఎల్‌ఐఓసీ) పెట్రోల్ రేట్లను పెంచిన మరుసటి రోజే.. దానికి అనుగుణంగా శ్రీలంక ప్రభుత్వ చమురు సంస్థ సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీ) కూడా సోమవారం అర్ధరాత్రి ధరలను పెంచేసింది. 92 ఆక్టేన్‌ పెట్రోల్‌ ధరను రూ.84 మేర పెంచేయడంతో లీటర్ పెట్రోల్ ధర రూ.338కి చేరింది.

గత ఆరు నెలల కాలంలో శ్రీలంకలో ఎల్‌ఐఓసీ ఇంధన ధరలను పెంచడం ఇది ఐదోసారి కాగా.. సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ నెలరోజుల వ్యవధిలో రెండు సార్లు పెంచింది. ఇప్పటికే ఇంధన, ఆహార, ఔషధ కొరతతో అల్లాడుతున్న శ్రీలంక ప్రజలకు తాజాగా పెంచిన ధరలు మరింత ఆగ్రహానికి గురిచేశాయి.

మరోవైపు, శ్రీలంకలో గొటబాయ రాజపక్స ప్రభుత్వానికి నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాజధాని కొలంబోలోని అధ్యక్ష కార్యాలయం ముందు భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడి నిరసనలు తెలుపుతున్నారు. భారీ ఎత్తున నిరసనలు కొనసాగుతుండటంతో పలు చోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అయితే, అప్పుల ఊబిలో కూరుకుపోయిన శ్రీలంక మాత్రం ప్రపంచ దేశాల సాయం కోరడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితిలో ఉండిపోయింది. ఇప్పటికే భారత్ తనవంతుగా భారీ సాయాన్ని అందించింది.

English summary
Sri Lanka crisis: One Dead, 12 Injured After Police Open Fire At Anti-Govt Protesters.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X