వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంక అధ్యక్షుడి ఇంట్లో గుట్టలు గుట్టలుగా నోట్ల కట్టలు: బిత్తరపోయిన ఆందోళనకారులు

|
Google Oneindia TeluguNews

కొలంబో: తీవ్ర సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటోన్న శ్రీలంకలో శనివారం చోటు చేసుకున్న పరిణామాల పట్ల ప్రపంచ దేశాలు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. లక్షలాది మంది ప్రజలు రోడ్లెక్కడం, దేశాధ్యక్షుడు గొటబయ రాజపక్స నివాసంపై దండెత్తడం, ఆయన ఇంట్లోకి దూసుకెళ్లిన ఉదంతం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కాగా- శ్రీలంక నౌకాదళానికి చెందిన ఎస్ఎల్ఎన్ఎస్ గజబాహు షిప్‌లో వెళ్తూ కనిపించిన రాజపక్స.. ఇప్పుడెక్కడ ఉన్నారనేది ఉత్కంఠత రేపుతోంది.

శ్రీలంకలో రోజుల తరబడి సంక్షోభ పరిస్థితులు కొనసాగుతుండటం, వాటి నుంచి దేశాన్ని బయటపడటానికి పాలకులు సరైన చర్యలను తీసుకోలేక చేతులెత్తేయడంతో ప్రజలు మరోసారి తిరుగుబాటు చేశారు. గొటబయ అధికార నివాసంపైకి దండెత్తారు. ఆయన నివాసంలోకి దూసుకెళ్లారు. రాజపక్స పారిపోయిన కొద్ది సేపటికే ప్రధాన మంత్రి రణిల్ విక్రమసింఘె తన పదవికి రాజీనామా చేయడం ప్రజలను మరింత ఆగ్రహానికి గురి చేసినట్టయింది. దీనితో వారు విక్రమసింఘె నివాసానికీ నిప్పు పెట్టారు.

ఇదంతా ఒక ఎత్తయితే.. శ్రీలంక అధ్యక్షుడి నివాసంలో నోట్ల కట్టలు గుట్టలుగా కనిపించడం మరో ఎత్తు. ఆయన ఇంట్లోకి దూసుకెళ్లిన సమయంలో వాటిని గుర్తించారు ఆందోళనకారులు. అందినంత దోచుకున్నారు. ఈ మొత్తాన్ని మళ్లీ భద్రత బలగాలు స్వాధీనం చేసుకున్నట్లు స్థానిక డెయిలీ మిర్రర్ తెలిపింది. ఇందులో విదేశీ కరెన్సీ నోట్లు సైతం ఉన్నట్లు వివరించింది. దీనికి సంబంధించిన పూర్తిస్థాయి సమాచారాన్ని వివరిస్తూ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

Sri Lanka crisis: Protesters find ‘millions of rupees’ inside the president’s residence: reports

ఆందోళనకారులు గొటబయ రాజపక్స నివాసంలో దోపిడీకి పాల్పడ్డారని, పెద్ద ఎత్తున నోట్ల కట్టలను నింపుకొన్నారని తెలిపింది. వాటిని భద్రత సిబ్బంది స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. ఎయిర్ కండీషన్డ్ మిషన్లు ఆయన ఇంట్లో నిరంతరాయంగా పని చేస్తున్నట్లు వివరించింది. విద్యుత్, ఇంధన కొరతతో దేశం మొత్తం అంధకారంలో కొట్టుమిట్టాడుతోన్న సమయంలో గొటబయ నివాసంలో ఏసీలు, ఇతర పరికరాలు ఇష్టానుసారంగా వినియోగమైనట్లు ఆందోళనకారులు తెలిపారని డెయిలీ మిర్రర్ వివరించింది.

English summary
Protesters in Sri Lanka find millions of rupees in the President Gotabaya Rajapaksa’s residence after they stormed in.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X