పొరుగున మార్క్సిస్ట్ ప్రభంజనం
Sri Lanka elections 2024 results: పొరుగుదేశం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు ప్రస్తుతం పూర్తయింది. ప్రారంభ ఫలితాలు.. అధ్యక్షుడి మార్పు తప్పదనే సంకేతాలను పంపించాయి. కొత్త అధ్యక్షుడిగా మార్క్సిస్ట్ నేత ఎన్నిక కావడం దాదాపుగా ఖాయమైనట్టే.
శనివారం శ్రీలంకలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ జరిగిన విషయం తెలిసిందే. అధ్యక్ష పదవి కోసం ప్రస్తుత నేత రణిల్ విక్రమసింఘె, సాజిత్ ప్రేమదాస, అనుర కుమార దిశనాయకె పోటీ పడ్డారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. దేశవ్యాప్తంగా 22 ఎలక్టోరల్ జిల్లాల్లో 13,400 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొత్త అధ్యక్షుడిని ఎన్నుకున్నారు.

సాయంత్రం 7 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఆరంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్లను లెక్కించారు. అర్ధరాత్రి దాటేంత వరకూ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు కొనసాగింది. ఇందులో మార్క్సిస్ట్ ప్రభంజనం కనిపించింది. వామపక్ష పార్టీ జనతా విముక్తి పెరామున (నేషనల్ పీపుల్స్ పవర్) తిరుగులేని మెజారిటీని సాధించింది.
ఆ పార్టీ అధినేత, ఎంపీ అనుర కుమార దిశనాయకె భారీ మెజారిటీని సాధించారు. ఆయనకు ఏకంగా 56 శాతం ఓట్లు పోల్ అయ్యాయి. ప్రతిపక్ష పార్టీ సమగి జన బలవెయగ ఘోర పరాజయాన్ని చవి చూసేలా కనిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష నేత సాజిత్ ప్రేమదాస రెండో స్థానానికి పరిమితం అయ్యేలా ఉన్నారు. ప్రస్తుత అధ్యక్షుడు రణిల్ విక్రమసింఘె మూడో స్థానంలో నిలిచారీ ప్రారంభ ఫలితాల్లో. ఆయనకు 19 శాతం మాత్రమే ఓట్లు పోల్ అయ్యాయి.
ప్రస్తుత పార్లమెంట్‌లో జనతా విముక్తి పెరామున పార్టీకి ఉన్నది మూడు సీట్ల బలమే. అయినప్పటికీ- దిశనాయకె కనివినీ ఎరుగని భారీ మెజారిటీని సాధించబోతోండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకను గట్టెక్కించగలిగేది మార్క్సిస్టులు మాత్రమేనని నిర్ణయించుకున్న లంకేయులు.. ఆ దిశగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్టయింది.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications