వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మిలిటరీ, పోలీసులకు ఎమర్జెన్సీ పవర్, వారంట్ లెకుండానే అరెస్ట్ చేసేందుకు పర్మిషన్

|
Google Oneindia TeluguNews

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పీక్‌కి చేరింది. నిరసనకారుల శాంతియుత ఆందోళన హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఘర్షణలో ఏడుగురు చనిపోగా.. 200 మంది గాయపడ్డారు. ఇప్పటికే ప్రధానమంత్రి మహింద్రా రాజపక్సే రాజీనామా చేశారు. ఇప్పటికే దేశంలో అమల్లో ఉండగా.. మిలిటరీ, పోలీసులకు అత్యవసర అధికారులను శ్రీలంక అధ్యక్షుడు కట్టబెట్టారు.

దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయికి చేరింది. దీంతో ప్రజలు రహదారులపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. దీంతో బుధవారం ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది. కోపం కట్టలు తెంచుకోవడంతో రాజకీయ నాయకులపై కూడా దాడి చేస్తున్నారు. షాపులు, ఇళ్లు, వాణిజ్య సముదాయాలకు నిప్పు పెడుతున్నారు. దీంతో నిరసనకారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. ఆందోళనకారులపై వారెంట్ లేకుండా మిలిటరీ, పోలీసులకు అధికారం ఇచ్చారు.

Sri Lanka gives emergency powers to army, police

ప్రైవేట్ సంస్థలు, వాహనాలను కూడా మిలిటరీ సోదాలు చేసే వీలు ఉంది. పోలీసులకు అప్పగించే 24 గంటల ముందు తమ వద్ద సైన్యం ఉంచుకునే వెసులుబాటు కలిగించారు. ఈ మేరకు మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అలాగే పోలీసులు కూడా ఎలాంటి అనుమతి లేకుండా పౌరులను అరెస్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. దేశవ్యాప్తంగా చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తున్నామని శ్రీలంక ప్రభుత్వం తెలిపింది. శుక్రవారమే అధ్యక్షుడు ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే.

జనం మాత్రం రోడ్లపైకి వచ్చి ఆందోళన చేస్తూనే ఉన్నారు. చాలా మంది ఐరన్ రాడ్లతో బీభత్సం చేశాడు. శ్రీలంకలో విదేశీ మారకద్రవ్యం నిల్వలు తగ్గిపోవడంతో ఆ దేశం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ధరలు భారీగా పెరిగి ఆహార సంక్షోభం నెలకొంది. గంటల తరబడి విద్యుత్‌ కోతలు విధిస్తుండడంతో జనం రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ క్రమంలో మిలిటరీ, పోలీసులకు అధ్యక్షుడు అధికారం ఇచ్చారు.

English summary
Sri Lanka has granted its military and police emergency powers to arrest people without warrants after a day of violence that killed seven people and injured more than 200.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X