వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంక అధ్యక్షుడు ఇలా పారిపోయాడు.. సీక్రెట్ బంకర్, లిప్ట్ ద్వారా కిందకి

|
Google Oneindia TeluguNews

శ్రీలంక జనం నిరసనలతో ప్రధాని రాజీనామా చేయగా.. అధ్యక్షుడు పారిపోయారు. పార్టీ కొత్త నేతను ఎన్నుకోనుంది. అయితే అధ్యక్షుడు గొటబయ రాజపక్సే 13వ తేదీన రాజీనామా చేసేందుకు అంగీకరించారు. కానీ అతని నివాసం వద్దకు ఆందోళనకారులు రావడంతో అంతకుముందు పారిపోయారు. ఆయన ఎప్పటిలాగా రాకుండా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బంకర్ ద్వారా బయటకు వచ్చారు. ప్రెసిడెంట్ ప్యాలెస్ వద్ద ఉన్న హై సెక్యూరిటీ బంకర్‌ను ఇండియా టుడే కనుగొంది. ఇక్కడినుంచి పారిపోయారని తెలిపింది.

ఇది అత్యంత సురక్షితమైన బంకర్.. తలుపు కనిపించదు. గదిని మెల్లగా తీయాలి.. అలాగే లిప్ట్ ద్వారా కిందకు వెళ్లాల్సి ఉంటుంది. అలా ఆయన పారిపోయారు. శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం పీక్‌కి చేరింది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్ ధరలను చెప్పాల్సిన అవసరం లేదు. దీంతో జనం ఆందోళనకు దిగారు.ప్రధాని విక్రమసింఘే, అధ్యక్షుడు రాజపక్సేను రాజీనామా చేయాలని కోరారు. దీంతో ప్రధాని రాజీనామా చేసి వెళ్లిపోయారు. అధ్యక్షుడు రిజైన్ చేయకముందే వెళ్లి పోయారు.

Sri Lanka President Gotabaya Rajapaksa fled through secret bunker

ప్రధాని విక్రమసింఘే రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆ వెంటనే మంత్రి బందుల గుణవర్దన రిజైన్ చేశారు. ప్రధాని సెక్యూరిటీ సిబ్బంది జర్నలిస్టులపై దాడి చేశారు. ఘటనను అంతా ఖండించారు. మరోవైపు పార్టీ నేతలు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పార్టీ నిర్ణయాన్ని స్పీకర్ అధ్యక్షుడు రాజపక్సేకు తెలియజేశారు. దీంతో అధ్యక్షుడు కూడా 13వ తేదీన రాజీనామా చేస్తారని తెలిసింది. శనివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో విక్రమసింఘే తన నిర్ణయాన్ని తెలియజేశారు. శ్రీలంకలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతుండటంతో.. విక్రమసింఘే పదవీ నుంచి వైదొలగాలని నిర్ణయం తీసుకున్నారు. అధ్యక్షుడు రాజపక్సే కూడా రాజీనామా చేయక తప్పని పరిస్థితి.

English summary
high security bunker at Sri Lanka's presidential palace on Sunday which President Gotabaya Rajapaksa may have used to escape.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X