వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శ్రీలంకలో ఎమర్జెన్సీ - ఆర్దిక సంక్షోభం తీవ్రరూపం : వీధుల్లోకి ప్రజలు - భారత్ వైపు..!!

By Chaitanya
|
Google Oneindia TeluguNews

శ్రీలంకలో పరిస్థితులు రోజు రోజుకీ దిగజారుతున్నాయి. దీంతో అధ్యక్షుడు రాజపక్సే శ్రీలంకలో ఎమర్జెన్సీ ప్రకటించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు వ్యక్తం అవుతున్న దృష్యా ఎమర్జెన్సీ విధించారు. ఈ మేరకు నిర్ణయం ప్రకటించిన అధ్యక్షుడు గొటబాయ రాజపక్స ఏప్రిల్‌ 1 నుంచే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని గెజిట్‌ జారీ చేశారు. దేశంలో ఆర్థిక సంక్షోభంతో నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రోజుకు 13 గంటలపాటు విద్యుత్‌ కోతలు విధిస్తున్నారు. దీంతో సాధారణ ప్రజల్లో అసహనం వ్యక్తం అవుతోంది.

శ్రీలకంలో అసాధారణ పరిస్థితులు

శ్రీలకంలో అసాధారణ పరిస్థితులు

ప్రభుత్వం పైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ సాధారణ ప్రజలు సైతం వీధుల్లోకి వస్తున్నారు. తాజాగా ఆ దేశ అధ్యక్షుడి ఇంటి ముందు చేప‌ట్టిన నిరసన ఉద్రిక్తతలకు దారితీసింది. శ్రీలంకలో ఏర్పడిన ఆర్థిక సంక్షోభానికి అధ్యక్షుడు గొటబాయ రాజపక్స కారణమంటూ నిరసనకారులు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో నిరసనకారులకు, పోలీసులకు మధ్య జరిగిన తోపులాటలో 10 మందికి గాయాలయ్యాయి. తీసుకున్నారు. ఆర్థిక సంక్షోభంతో గత కొన్ని రోజులుగా ఆ దేశంలో నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. కరోనా దెబ్బకు శ్రీలంక ఆర్దిక వ్యవస్థ దారుణగా దెబ్బ తింది. చిన్న పిల్లల పాలపొడి ధర సైతం భారీగా పెరిగిపోయింది. కాగితం కొరతతో పరీక్షల వాయిదా నిర్ణయం తీసుకున్నారు.

పరీక్షలకు కాగితాలు లేవు.. డీజిల్ సైతం లేదు

పరీక్షలకు కాగితాలు లేవు.. డీజిల్ సైతం లేదు

డీజిల్‌ విక్రయాలను నిలిపివేశారు.గొటబయ రాజపక్స నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న అనాలోచిత నిర్ణయాలు సంక్షోభాన్ని మరింత ముదిరేలా చేశాయి. తక్కువ పన్ను రేట్ల వంటి అమలుకు సాధ్యం కాని అనేక హామీలను సర్కార్‌ అమలు చేసింది. వ్యాట్‌ను 15% నుంచి 8 శాతానికి కుదించింది. ఆదాయపన్ను మినహాయింపు పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షలకు పెంచింది. నిధుల సమీకరణకు కీలకంగా ఉన్న నేషన్‌ బిల్డింగ్‌ ట్యాక్స్‌, పేయీ ట్యాక్స్‌, ఆర్థిక సేవల పన్నును పూర్తిగా రద్దు చేసింది. దీంతో పన్ను చెల్లింపుదారుల సంఖ్య 33.5 శాతం మేర పడిపోయింది. చైనాకు మహీంద్ర మితిమీరిన ప్రాధాన్యం ఇచ్చారు. అదే ఒకరకంగా ఆ దేశాన్ని కొంపముంచింది.

భారత్ వైపు ఆశగా చూపులు

భారత్ వైపు ఆశగా చూపులు

ఇక, శ్రీలంకలో దిగజారుతున్న పరిస్థితుల్లో కొద్ది రోజుల క్రితం శ్రీలంక కు భారత్ చేయూతను ఇచ్చింది. జనవరిలో ఆర్‌బీఐ శ్రీలంకకు 400 మిలియన్‌ డాలర్ల కరెన్సీ స్వాప్‌ వెసులు బాటును కల్పించింది. భారత్‌ నుంచి ఇంధన కొనుగోళ్లకు 500 మిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ లైన్‌ను ప్రకటించింది. మార్చి రెండోవారం నుంచి ఆ దేశానికి మన ఐఓసీ చమురును సరఫరా చేస్తోంది. నిత్యావసరాలు, ఔషధాల దిగుమతికి సైతం భారత్‌ మరో 1 బిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ లైన్‌ను ఇవ్వడానికి ముందుకు వచ్చింది. మరో 1 బిలియన్‌ డాలర్ల క్రెడిట్‌ లైన్‌ లంక ప్రభుత్వం అభ్యర్థిస్తోంది.

English summary
Sri Lankan President Gotabaya Rajapaksa issued a Gazette Extraordinary declaring a state of emergency in the country with effect from April 1.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X