చైనా: బతికున్న చేపలను నమిలి మింగేశారు
బీజింగ్: చైనాలో ఇటీవల ఓ జుగుప్సకరమైన వీడియో బయటకు వచ్చింది. బతికున్న చేపలను కొందరు వ్యక్తులు మధ్యం మత్తులో కరకర నమిలి మింగేశారు. ఈ వీడియోను చూసిన మాంసాహారులు సైతం అసహ్యించుకుంటున్నారు. ఈ వీడియోను ఓ వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టాడు.
బీజింగ్ నగరంలో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ఇటీవల తన ఇంటిలో స్నేహితులకు మందు (మధ్యం) పార్టీ ఇచ్చాడు. కావలసినంత మందు తీసుకు వెళ్లారు. అందులోకి వేడి వేడి సాస్ తయారు చేసుకున్నారు. టేబుల్ మీద మందు బాటిళ్లు, సాస్, దాని పక్కనే ఓ నీటి పాత్ర పెట్టారు.

నీటి పాత్రలో బతికి ఉన్న చేప పిల్లలు ఉన్నాయి. మందు సేవించడం మొదలు పెట్టిన తరువాత బతికి ఉన్న చేపలను పట్టుకుని సాస్ లో వేస్తూ వచ్చారు. ఆ చేప పిల్లలు ప్రాణం కోసం కొట్టుకుంటున్న సమయంలో స్పూన్ లాంటి వస్తువు తీసుకుని ఆ చేప పిల్లలను నోటిలో వేసుకుని కరకర నమిలేశారు.
ఈ తతంగం ఓ వ్యక్తి మొబైల్ లో వీడియో తీశాడు. దానిని సోషల్ మీడియాలో పెట్టాడు. పార్టీ చేసుకుంటే ఇలా చేసుకోవాలని పోస్టు చేశాడు. అంతే ఆ వీడియో చూసిన అనేక మంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే చైనా ప్రజలు ఆ పార్టీని సమర్థిస్తున్నారు. బతికున్న చేపలను తినడం ఇది మొదటి సారి కాదని తూర్పు ఆసియా ప్రాంతంలో సర్వసాధారణంగా ఇలా బతికి ఉన్న చేపలను తింటుంటారని అంటున్నారు.












Click it and Unblock the Notifications