వేలు చూపిస్తే చూపించిందిగానీ... జాక్‌పాట్ కొట్టేసింది!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కు మధ్య వేలు చూపించి తన అసహనాన్ని వ్యక్తం చేసి ఆపైన ఉద్యోగం పోగొట్టుకున్న జూలీ బ్రిస్క్‌మాన్ ను క్రౌడ్‌ఫండింగ్ ద్వారా ఆదుకునేందుకు నెటిజన్లు నడుం బిగించారు.

Recommended Video

    మధ్యవేలు చూపించి 7 రోజుల్లోనే 70 వేల డాలర్లు సంపాదించింది !

    వాషింగ్టన్‌ : జూలీ బ్రిస్క్‌మాన్‌.. అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చుకానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌కు మధ్యవేలు చూపించి తన అసహనాన్ని ప్రకటించిన మహిళ అంటే అందరికీ ఠక్కున గుర్తుకొస్తుంది.

    రెండువారాల క్రితం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ వర్జీనియాలో గోల్ఫ్‌ ఆడి తిరిగి వెళుతున్న సమయంలో జూలీ.. ఆయన కాన్వాయ్‌ని వెంబడించి మరీ మధ్య వేలు చూపించిన సంగతి తెలిసిందే.

    Strangers Are Throwing Money at Woman Who Gave Trump the Finger

    ఈ ఘటనతో జూలీ బ్రిస్క్‌మాన్‌ తన ఉద్యోగం కూడా పోగొట్టుకుంది. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడికే వేలు చూపించడంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. అప్పటినుంచి ఆమెకు ఉపాధి లేకుండా పోయింది.

    అయితే ట్రంప్‌కు.. జూలీ మధ్యవేలు చూపిస్తున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడం..అదే సమయంలో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించడంతో నెటిజన్లకు జూలీ మీద అభిమానం పొంగింది.

    ఉద్యోగం కూడా పోగొట్టుకున్న జూలీ.. పాపం ఎలా బతుకుతుందనుకున్నారో ఏమోగానీ క్రౌడ్ ఫండింగ్ ద్వారా ఆమె కోసం విరాళాలు సేకరించడం ప్రారంభించారు. ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పని చేస్తున్న అకిమా.. సామాజిక మాధ్యమాల ద్వారా ఈ పని చేస్తున్నారు.

    దీంతో కేవలం 7 రోజుల్లోనే 70 వేల డాలర్లు వచ్చిపడ్డాయి. కేవలం 3 వేల మంది దాతలు ఈ మొత్తాన్ని అందించడం విశేషం. క్రౌడ్‌ ఫండింగ్‌ ద్వారా లక్ష డాలర్లు సేకరించి జూలీ బ్రిస్క్‌మాన్ కు అందించనున్నట్లు అకిమా తెలిపారు.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+