‘యూఎస్‌కు బదులు ఐఎస్’: విద్యార్థి తొలగింపు

వాషింగ్టన్: ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు ప్రపంచ వ్యాప్తంగా యువతను ఆకర్షించేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఆ ఉగ్ర వలకు యువతతోపాటు మైనర్లు కూడా ఆకర్షితులవుతుండటం ఆందోళన కలిగించే విషయం.

అమెరికాలోని ఓ పాఠశాలలో ఉగ్రసంస్థ ఐఎస్ పేరును వల్లిస్తున్న కుర్రాడిపై ఫెడరల్ అధికారులు దర్యాప్తు చేపట్టారు. క్లాసు నుంచి తొలగించి విడిగా కూచోబెట్టి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. అమెరికాలోని కనెక్టి కట్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది.

పాఠశాలలలో ఉదయపు ప్రార్థనల సందర్భంగా చేసే ప్రతిజ్ఞలో యూఎస్(అమెరికా) అనాల్సిన సందర్భంలో ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఉగ్రవాద సంస్థ ఐఎస్ పేరు పలకాడు ఆ 15ఏళ్ల విద్యార్థి.

Student Says 'ISIS' in Pledge, Gets Pulled From High School

కనెక్టికట్ రాష్ట్రంలోని అన్సోనియాలో గత క్రిస్మస్ సెలవుల కంటే ముందే ఈ ఘటన జరిగింది. మైనర్ కావడంతో ఆ విద్యార్థి పేరును అధికారులు వెల్లడించలేదు. ఆ విద్యార్థి తల్లి మాత్రం తనకొడుకు ఎలాంటి తప్పుచేయలేదని చెబుతోంది.

అన్నీ నిర్ధారించుకున్న తర్వాతే చర్య తీసుకున్నామని అధికారులు అంటున్నారు. ఆ కమ్యూనిటీకి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు. కాగా, అక్కడి నిబంధనల ప్రకారం ఈ వ్యవహారాన్ని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+