పాకిస్తాన్ లో పుల్వామా తరహా ఉగ్రవాద దాడి- సైనికులు మృత్యువాత

పాకిస్తాన్‌లో భారీ ఉగ్రవాద దాడి చోటు చేసుకుంది. ఈ ఘటనలో 13 మంది సైనికులు దుర్మరణం పాలయ్యారు. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉండటం వల్ల మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఖైబర్ పఖ్తున్ ఖ్వా ప్రావిన్స్‌ లోని నార్త్ వజీరిస్తాన్ జిల్లాలో ఈ మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. బాంబులతో నిండిన వాహనంతో ఓ ఫిదాయి.. నేరుగా ఆర్మీ కాన్వాయ్‌ ను ఢీకొట్టాడు. ఈ ఘటనలో 13 మంది సైనికులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 19 మంది తీవ్రంగా గాయపడ్డారు.

Suicide attack kills 13 soldiers in Pakistan

ఈ పేలుడు ధాటికి సమీపంలో ఉన్న పలు నివాసాల పైకప్పులు కూలిపోయాయి. ఈ ఘటనలో ఆరుమంది పిల్లలు గాయపడ్డారని నార్త వజీరిస్తాన్ జిల్లా పోలీసు అధికారి తెలిపారు. దాడిలో గాయపడిన నలుగురు సైనికుల పరిస్థితి విషమంగా ఉందని పేర్కొన్నారు.

సమాచారం అందిన వెంటనే రక్షణ బలగాలు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. అత్యవసర చికిత్సను అందించారు. పేలుడు సంభవించిన వెంటనే ఆర్మీ కాన్వాయ్ లోని పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. తుక్కు తుక్కు అయ్యాయి.

ఈ ఆత్మాహుతి దాడికి తామే బాధ్యత వహిస్తున్నట్లు హఫీజ్ గుల్ బహదూర్ గ్రూప్ ప్రకటించింది. పాకిస్తాన్ తాలిబాన్ అనుబంధ సంస్థగా దీనికి గుర్తింపు ఉంది. పాకిస్తాన్ అణచివేత ధోరణికి నిరసనగా ఈ దాడికి పాల్పడినట్లు వెల్లడించింది. మున్ముందు మరిన్ని దాడులు ఉంటాయనీ హెచ్చరించింది.

2021లో ఆఫ్ఘనిస్తాన్‌ లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచీ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో హింస పెరిగింది. సరిహద్దుల్లో దాడులకు పాల్పడుతున్న మిలిటెంట్లకు ఆఫ్ఘనిస్తాన్ ఆశ్రయం ఇస్తోందని ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను తాలిబాన్ ప్రభుత్వం ఆరోపణలను తిప్పికొడుతూ వస్తోంది.

ఏఎఫ్‌పీ వివరాల ప్రకారం, ఈ సంవత్సరం ప్రారంభం నుండి ఖైబర్ ఫఖ్తున్ ఖ్వా, బలూచిస్తాన్‌లలో ప్రభుత్వ వ్యతిరేక సాయుధ గ్రూపుల దాడుల్లో సుమారు 290 మంది మరణించారు. వీరిలో ఎక్కువ మంది భద్రతా సిబ్బందే ఉన్నారు.

ఈ ఏడాది మార్చిలో దక్షిణ వజీరిస్తాన్‌లోని ఝండోలా చెక్‌ పోస్ట్ సమీపంలో ఫ్రాంటియర్ కార్ప్స్ క్యాంప్‌ పై జరిగిన ఆత్మాహుతి దాడి తర్వాత తెహ్రిక్-ఎ-తాలిబాన్ పాకిస్తాన్ (TTP)కు చెందిన 10 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు పాకిస్తాన్ ఆర్మీ ప్రకటించింది.

పాకిస్తాన్‌లో ఉగ్రవాద సంబంధిత మరణాలు విపరీతంగా పెరిగాయి. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2025 ప్రకారం, దేశంలో ఇలాంటి మరణాలు 45% పెరిగాయి, 2023లో 748 నుండి 2024లో 1,081కి చేరుకున్నాయి, ఇది ఉగ్రవాద హింసతో ప్రపంచంలో రెండవ అత్యధికంగా ప్రభావితమైన దేశంగా నిలిచింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+