కాబూల్‌లో ఆత్మాహుతి దాడి, 12 మంది మృతి

ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు మరోసారి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పీడీ3లోని గులే ఆసుపత్రి ప్రాంతంలో సోమవారం నాడు కారుబాంబుతో ఆత్మాహుతికి పాల్పడ్డారు.

కాబూల్: ఆఫ్గనిస్థాన్ రాజధాని కాబూల్‌లో ఉగ్రవాదులు మరోసారి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. పీడీ3లోని గులే ఆసుపత్రి ప్రాంతంలో సోమవారం నాడు కారుబాంబుతో ఆత్మాహుతికి పాల్పడ్డారు.ఈ ఘటనలో 12మంది చనిపోయారు.మరో 10 మంది గాయపడ్డారు.

ప్రముఖ రాజకీయనాయుడు మహ్మద్ మోహఖిక్ ఇంటికి సమీపంలో కారుబాంబుతో ఆత్మాహుతికి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సుమారు 12 మంది చనిపోయారు. పలువురు గాయపడినట్టు సమాచారం.

Suicide bombing kills 12, injures 10 more in Afghan capital

ఈఘటనను ఆఫ్గాన్ హోంమంత్రిత్వశాఖ నజీబ్ దానిశ్ ధృవీకరించారు. కీలక రాజకీయ నాయకుల నివాసాలు ఉన్న చోట పేలుడు జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అయితే ఈ దాడికి ఎవరూ పాల్పడ్డారనేది ఇంతవరకు ఎవరు ప్రకటించలేదు. తాలిబన్లు తరచూ ఈ రకమైన దాడులకు దిగుతుంటారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+