ఆయనను మాట్లాడొద్దన్నారు: సునంద మృతిపై మెహర్
ఇస్లామాబాద్: కేంద్రమంత్రి శశిథరూర్ సతీమణి సునంద పుష్కర్ మృతికి దారితీసిన వివాదానికి కేంద్ర బిందువైన మెహర్ తరార్ ఆదివారం స్పందించారు. థరూర్ దంపతుల మధ్య సంబంధాలు దెబ్బతినడంలో తన పాత్ర ఏమీ లేదని, తానొక కుట్రకు బలయ్యానని పేర్కొన్నారు.
ఓ వ్యాసంలో తాను శశిథరూర్‌ను పొగిడానని, అది సునందకు నచ్చలేదనుకుంటానని, అందుకే తనతో మాట్లాడొద్దని ఆమె ఆయనను కోరారని, అయినా ఆయన తనను ట్విటర్‌లో ఫాలో అవుతుండటంతో అదీ మానేయాలని సునంద చెప్పారని, తాను ఆయనతో మాట్లాడిన మాటలు ప్రపంచంలో ఎవరితోనైనా, ఎప్పుడైనా మాట్లాడతగినవేనని, వాళ్లిద్దరి మధ్యా (గత ఏడాది) మే, జూన్ నుంచే సమస్యలున్నాయని తరర్ చెప్పారు.

వారి జీవితంలో తాను ఇన్‌వాల్వ్ కాలేదని, అప్పటికి తానెవరో కూడా ఆమెకు తెలియదన్నారు. తాను జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్‌ను ఇంటర్వ్యూ చేశాక సునంద తనపై తొలిసారి దాడి చేసినట్టు తెలిపారు. అప్పట్నుంచే సునంద తనతో పోరాటానికి దిగారని ఆవేదన చెందారు. అసలు నష్టం తనకే జరిగిందన్నారు.
గూగుల్‌లో చూస్తే థరూర్, సునందల మధ్య వివాహం తెగతెంపులయ్యే వాతావరణం కనిపిస్తోందని అంతకుముందే వార్తలు వచ్చాయని చెప్పారు. సునందకు నిస్పృహ ఆవహించినప్పుడల్లా ట్విట్టర్లోకి వస్తారని, చాలాకాలంగా అనారోగ్యంతో ఉన్నారని, ఆమె తినడం లేదని, పదే పదే సిగరేట్లు కాలుస్తున్నారని కొందరు చెప్పారన్నారు. భర్తతో గొడవపడి అనారోగ్యంతో మూలనపడితే దానికి నేనెలా బాధ్యత వహిస్తానన్నారు.
కాగా, సునంద మృతికి సంతాప సూచకంగా మెహర్ తన ట్విట్టర్ ప్రొఫైల్లో ఫోటోను మార్చారు. వెలుగుతునన కొవ్వొత్తి ఫోటోను ఉంచారు.












Click it and Unblock the Notifications