వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాప్ 10 లీడర్స్: ఒబామా ఫస్ట్, మోడీకి ఏడో స్థానం

|
Google Oneindia TeluguNews

లండన్: ప్రపంచంలో అత్యంత పాపులర్ నేతగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా మొదటి స్థానంలో నిలిచారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఏడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఓఆర్ బీ ఇంటర్నేషనల్ నిర్వహించిన సర్వేలో 24 శాతం మంది నరేంద్ర మోడీకి అనుకూలంగా ఓట్లు వేశారు.

ఓఆర్ బీ ఇంటర్నేషనల్ ‘ఇంటర్నేషనల్ వరల్డ్ లీడర్ సూచిక' విన్/గాలవ్ సర్వేలో ప్రధాని మోడీకి ప్లస్ నాలుగు శాతం ఓట్లు వేశారు. అదేవిధంగా ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా 20 శాతం ఓట్లు పోలయ్యాయి.

ఈ సర్వేలో చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ భారత ప్రధాని నరేంద్ర మోడీని వెనక్కి నెడుతూ 30 శాతం ఓట్లతో ఆరో స్థానంలో నిలిచారు. అమెరికా అధ్యక్షుడు ఒబామాకు అనుకూలంగా 59 శాతం ఓట్లు, ఆయనకు వ్యతిరేకంగా 29 శాతం ఓట్లు పోలవడంతో వార్తల్లో నిలిచారు.

Survey: Barack Obama most popular leader in World, PM Modi stands 7th

ప్లస్ 13 శాతం ఓట్లతో జర్మనీ చాన్స్ లర్ ఎంజెలా మార్కెల్ రెండో స్థానంలో నిలిచారు. మూడో స్థానంలో బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ నిలిచారు. ఆయనకు ప్లస్ 57 శాతం ఓట్లు వచ్చాయి. ఆయనకు వ్యతిరేకంగా 37 శాతం ఓట్లు వేశారు.

నాలుగో స్థానంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాంకోయిన్ హాలండ్, ఐదో స్థానంలో రష్యా ప్రధాని వ్లాదిమిర్ పుతిన్ చోటు దక్కించుకున్నారు. బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్ ఎనిమిదో స్థానంలో, సౌదీ అరేబియా రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజిజ్ అల్ అసద్ తోమ్మిదో స్థానంలో నిలిచారు.

ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ 10వ స్థానంలో నిలిచారు. ప్రపంచ దేశాల్లో ప్రజాదరణ పొందుతున్న నేతల్లో టాప్ 10లో వీరు నిలిచారని సర్వే నివేదిక వెల్లడించింది. ప్రధాని నరేంద్ర మోడీ ఏడో స్థానంతో సరి పెట్టుకున్నారు.

English summary
Prime Minister Narendra Modi has been voted as the seventh most popular leader in the world in a new poll topped by US President Barack Obama.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X