బంగ్లాదేశ్ మసీదులో పేలుడు: 17 మంది మృతి, పలువురికి గాయాలు..
బంగ్లాదేశ్‌లో భారీ పేలుడు జరిగింది. ఢాకా శివారులో గల నారాయణ్ గంజ్ జిల్లాలో గల మసీదులో ప్రమాదం జరిగింది. గ్యాస్ పైప్ లైన్ వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నాయి. ప్రమాదంతో 17 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. 37 మందిని ఢాకా స్పెషలిస్ట్ బర్న్ అండ్ ప్లాస్టిక్ సర్జరీ ఆస్పత్రికి తరలించారు.

చనిపోయిన 17 మందిలో ఒక చిన్నారి కూడా ఉన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అని స్థానిక అధికారులు తెలిపారు. మసీదులో పేలుడు జరిగాక.. దట్టమైన పొగ అలుముకుంది. దీంతో జనం పరుగులు తీయడం తాను చూశానని మహ్మద్ రతన్ అనే స్థానికుడు పేర్కొన్నారు. ప్రమాద ఘటనపై దర్యాప్తు జరుపుతున్నామని అధికారులు తెలిపారు.












Click it and Unblock the Notifications