ఎమర్జెన్సీ ల్యాండింగ్, కూలిన విమానం: 51 మంది మృతి

కాగా, ఈ విమానం ప్రమాదంలో మృతుల పైన రెండు రకాల వాదనలు వినిపిస్తున్నాయి. ఏజెన్స్ ఫ్రాన్స్ ప్రెస్సీ ప్రకారం నలభై మందికి పైగా మృతి చెందారు. అయితే, స్థానిక మీడియా మాత్రం 51 మంది మృతి చెందగా, 7గురు మృతి చెందారని చెబుతోంది.
ప్రమాదం సంభవించిన విమానం ట్రాన్స్ ఏషియా ఎయిర్ వేస్ విమానం. ఇది ఎమర్జెన్సీ ల్యాండింగ్ అవుతున్న సమయంలో కూలిపోయింది. దీంతో ఈ ప్రమాదం సంభవించింది.
ప్రమాదం చోటు చేసుకున్న ప్రాంతంలో టైఫూన్ ప్రభావంతో గాలులు, భారీ వర్షపాతం చోటు చేసుకంది. వాతావరణం అనుకూలించక పోవడంతోనే విమానం కూలిపోయిందంటున్నారు. విమానం తైవాన్ రాజధాని తైపే నుండి పెంఘుకు వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.












Click it and Unblock the Notifications