Afghanistan: పంజ్‌షీర్‌లో పరిస్థితేంటి-తాలిబన్లు అక్కడ అడుగుపెట్టారా-మరో ఫత్వాతో మహిళలకు షాక్

ఆఫ్గనిస్తాన్‌ను ఆక్రమించి ఇస్లామిక్ ఎమిరేట్స్ రాజ్యాన్ని స్థాపించిన తాలిబన్లు ఒక్కొక్కటిగా ఫత్వాలు జారీ చేస్తున్నారు. ఇప్పటికే హెరాత్ ప్రావిన్స్‌లో కోఎడ్యుకేషన్‌పై నిషేధం విధించిన తాలిబన్లు.. తాజాగా మ్యూజిక్‌పై నిషేధం విధించారు. టీవీ,రేడియో ఛానెళ్లలో మహిళలు పనిచేయడంపై నిషేధం ప్రకటించారు. ఆఫ్గన్‌ను ఆక్రమించాక ఏర్పాటు చేసిన తొలి ప్రెస్‌మీట్‌లో మహిళలకు ఉద్యోగ అవకాశాలపై సానుకూలంగా స్పందించిన తాలిబన్లు... ఇప్పుడు తమ అసలు బుద్ది ప్రదర్శిస్తున్నారు.తాలిబన్లు చెప్పిన శాంతి వచనాలు,స్వేచ్చ,భద్రత వట్టి మాటలేనని తేలిపోయింది.

పంజ్‌షీర్‌లో పరిస్థితి ఎలా ఉంది...

పంజ్‌షీర్‌లో పరిస్థితి ఎలా ఉంది...

ఇప్పటివరకూ తాలిబన్ల చేతికి చిక్కని ఒకే ఒక్క ఆఫ్గన్ ప్రావిన్స్ పంజ్‌షీర్‌పై తాలిబన్లు గురిపెట్టిన సంగతి తెలిసిందే. వారం రోజుల క్రితమే పదుల సంఖ్యలో వాహనాల్లో వందలాది తాలిబన్లు పంజ్‌షీర్ వైపు కదిలారు. ప్రస్తుతం పంజ్‌షీర్‌లో పరిస్థితిపై స్పష్టమైన సమాచారం తెలియట్లేదు. పంజ్‌షీర్‌లోకి తాలిబన్లు ప్రవేశించారనే కథనాలు ఓవైపు.. ఇంతవరకూ తాలిబన్లు అక్కడ అడుగుపెట్టలేదనే కథనాలు మరోవైపు... దీంతో అసలు అక్కడ వాస్తవ పరిస్థితి ఏంటనేది తెలియరావట్లేదు.

ఇంతలోనే పంజ్‌షీర్‌కు సంబంధించి మరో వార్త బయటకొచ్చింది. పంజ్‌షీర్‌లో తాలిబన్లు ఇంటర్నెట్‌ను నిలిపివేసినట్లు చెబుతున్నారు. ఆఫ్గన్ ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ ట్విట్టర్‌ ఉపయోగించకుండా చేసేందుకు ఈ చర్యకు పాల్పడినట్లు చెబుతున్నారు.

పంజ్‌షీర్ నుంచే తిరుగుబాటు వ్యూహాలు

పంజ్‌షీర్ నుంచే తిరుగుబాటు వ్యూహాలు

ఆఫ్గన్ అధ్యక్షుడు ఆష్రఫ్ ఘనీ దేశం వీడి పారిపోవడంతో ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్ తనకు తాను ఆపద్ధర్మ అధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు. రాజ్యాంగం తనకు ఆ హక్కు కల్పించిందన్నారు. ఆ వెంటనే కాబూల్ నుంచి పంజ్‌షీర్ వెళ్లిపోయిన అమృల్లా సలేహ్.. అక్కడి నాయకుడు అహ్మద్ మసూద్‌తో కలిసి తాలిబన్లపై తిరుగుబాటుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఉత్తర కూటమితోనూ సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ వ్యూహాల ఫలితంగానే బాగ్లన్ ప్రావిన్స్‌లోని 3 జిల్లాలను ప్రజలు సాయుధ పోరాటంతో తాలిబన్ల నుంచి కైవసం చేసుకున్నారు. అయితే తిరిగి తాలిబన్లు మళ్లీ వాటిని తమ నియంత్రణలోకి తెచ్చుకోగలిగారు.

ఇప్పటికైతే యుద్ధం మొదలవలేదు...

ఇప్పటికైతే యుద్ధం మొదలవలేదు...

పంజ్‌షీర్ నాయకుడు తాలిబన్లతో పోరాడేందుకు దాదాపు 9వేల మంది ప్రజలకు సాయుధ శిక్షణ ఇచ్చినట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అదే సమయంలో ఆయన లొంగిపోయేందుకు సిద్దమవుతున్నారనే కథనాలూ వచ్చాయి. అయితే పంజ్‌షీర్‌కు ఉన్న పేరును నిలుపుకునేలా... అక్కడి ప్రజలు తాలిబన్లతో పోరాటానికే సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికైతే అక్కడ యుద్దం మొదలైనట్లుగా ఎలాంటి సమాచారం లేదు. తాలిబన్లు పంజ్‌షీర్‌ను నలువైపులా చుట్టుముట్టే ప్రయత్నాల్లో ఉన్నారు. అదే జరిగితే ఇరువరి మధ్య భీకర యుద్ధం జరగవచ్చు. 1980-1985లో సోవియెట్ యూనియన్‌కు,1996లో తాలిబన్లకు పంజ్‌షీర్ లొంగలేదు. అప్పటినుంచి ఇప్పటివరకూ అది శత్రుదుర్భేద్యంగానే ఉంది. దీంతో పంజ్‌షీర్‌ను ఆక్రమించి చరిత్ర తిరగరాయాలని తాలిబన్లు భావిస్తున్నారు.

అంతర్జాతీయ సమాజపు మద్దతు కరువు...

అంతర్జాతీయ సమాజపు మద్దతు కరువు...

ఇప్పటికీ అంతర్జాతీయంగా పంజ్‌షీర్‌కు ఎటువంటి మద్దతు లభించట్లేదు. వారికి సాయం చేసేందుకు ఏ దేశం ముందుకు రాలేదు. దీంతో తాలిబన్లతో సుదీర్ఘ పోరాటం జరపాల్సి వస్తే... పంజ్‌షీర్ ఎంతమేర వారిని నిలువరించగలదనేది ప్రశ్నార్థకమే. మసూద్ తండ్రి అహ్మ‌ద్ షా మ‌సూద్ గతంలో ఆఫ్గన్ ఆర్మీ జనరల్‌గా పనిచేశారు. అప్పట్లో సోవియెట్ యూనియన్‌ను పంజ్‌షీర్‌లో అడుగుపెట్టకుండా తిప్పికొట్టడంలో ఆయన కీలక పాత్ర పోషించారు.1996లో తాలిబన్లు దేశమంతా ఆక్రమించుకుని పంజ్‌షీర్‌లో అడుగుపెట్టలేకపోయారంటే ఆయనే కారణం. 2001లో ఆల్ ఖైదా ఆయన్ను మట్టు పెట్టింది. ఇప్పటికీ ఆఫ్గన్ ప్రజలు ఆయన్ను నేషనల్ హీరోగా కొనియాడుతారు. ఆయన స్పూర్తితోనే పంజ్‌షీర్ ఇప్పుడు తాలిబన్లతో యుద్ధానికి సిద్దమవుతోంది.

ఇటీవలే తాలిబన్ల తొలి ఫత్వా

ఇటీవలే తాలిబన్ల తొలి ఫత్వా

తాలిబన్ల నుంచి మొదటి ఫత్వా జారీ అయింది. ఇకపై ప్రభుత్వ,ప్రైవేట్ యూనివర్సిటీల్లో కోఎడ్యుకేషన్‌ను నిషేధిస్తున్నట్లు ఆ ఫత్వాలో పేర్కొన్నారు. సమాజంలోని అన్ని రుగ్మతలకు మూలం కోఎడ్యుకేషన్‌లోనే ఉందన్నారు.ఇప్పటికైతే హెరాత్ ప్రావిన్స్‌లో మాత్రమే ఈ నిషేధాన్ని ప్రకటించారు.హెరాత్ ప్రావిన్స్‌లోని యూనివర్సిటీ ప్రొఫెసర్లు,ప్రైవేట్ వర్సిటీల యాజమాన్యాలతో తాలిబన్ అధికారులు సమావేశమై కోఎడ్యుకేషన్‌పై చర్చించారు. సమావేశ అనంతరం కోఎడ్యుకేషన్‌పై నిషేధం విధిస్తున్నట్లు ఫత్వా జారీ చేశారు. తాలిబన్ల విధానాలు మొదటి నుంచి విద్యకు వ్యతిరేకంగానే ఉన్నాయి.ముఖ్యంగా స్త్రీలకు విద్య,ఉద్యోగాలను మొదటి నుంచి వారు నిరాకరిస్తున్నారు.

స్త్రీల హక్కులు మృగ్యమే...

స్త్రీల హక్కులు మృగ్యమే...

1996-2001 వరకు సాగిన తాలిబన్ల పాలనలో స్త్రీలకు హక్కులే లేకుండా పోయాయి. వారికి విద్య,ఉద్యోగాలపై తాలిబన్లు నిషేధం విధించారు. ఇంటి గడప దాటాలంటే మగ తోడు ఉండాల్సిందేనని... అది కూడా కుటుంబ సభ్యులే అయి ఉండాలని ఆంక్షలు పెట్టారు. బలవంతంగా వారికి తాలిబన్ ఫైటర్లతో పెళ్లిళ్లు జరిపించేవారు. స్త్రీ అంటే కేవలం సంతానం కోసమే అనే భావన వారిలో నాటుకుపోయింది. 2001లో తాలిబన్ల పాలన ముగిశాక 2002 నుంచి ఇప్పటివరకూ మిలియన్ల సంఖ్యలో మహిళలు చదువు బాట పట్టారు. తిరిగి సాధారణ జీవితంలోకి వచ్చారు. రాజకీయాల్లోనూ రాణించారు. కానీ ఇప్పుడు దేశం మళ్లీ తాలిబన్ల చేతుల్లోకి వెళ్లడంతో వారి భవిష్యత్‌ అంధకారంలోకి నెట్టినట్లయింది. అంతర్జాతీయ సమాజం ఆఫ్గనిస్తాన్‌లో స్త్రీల హక్కులపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ప్రజాస్వామ్యానికి తావు లేదు...

ప్రజాస్వామ్యానికి తావు లేదు...

నిజానికి ఇటీవలి తాలిబన్ల మొదటి ప్రెస్‌మీట్‌లో వారి మాటలు కాస్త ఉదారంగా అనిపించాయి. స్త్రీలకు విద్య,ఉద్యోగ రంగాల్లో అవకాశాలు కొనసాగుతాయని వారు ప్రకటించారు. షరియా చట్టాలకు లోబడి వారి హక్కులకు గౌరవం,భద్రత కల్పిస్తామన్నారు. కానీ కొద్దిరోజులకే వారి అసలు రంగు బయటపడుతోంది. ఆఫ్గనిస్తాన్‌లో ప్రజాస్వామ్యానికి తావు లేదని ఇస్లామిక్ చట్టాలకు లోబడే వ్యవస్థలు,వ్యక్తులు నడుచుకోవాలని తాలిబన్లు హుకుం జారీ చేస్తున్నారు.అవకాశం దొరికితే ఆఫ్గనిస్తాన్ నుంచి బయటపడేందుకే ఎంతోమంది ఆఫ్గన్లు ఎదురుచూస్తున్నారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అది అసాధ్యంగానే కనిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+