వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తాలిబన్ల సంచలన నిర్ణయం- ఇక ఆ డిగ్రీలు చెల్లవు-తిరిగి చదవాల్సిందే

|
Google Oneindia TeluguNews

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వం నుంచి అధికార పగ్గాలు తీసుకున్న తాలిబన్లు క్రమంగా దేశంలోని అన్ని వ్యవస్ధలపై పట్టు బిగిస్తున్నారు. ఇందులో భాగంగా విద్యారంగంలో భారీ మార్పులు తీసుకురానున్నారు. ఇప్పటికే దేశంలో షరియా చట్టాల్ని మాత్రమే అమలు చేస్తామని ప్రకటించిన తాలిబన్లు.. ఇందుకోసం గతంలో ఆధునిక విద్య చదువుకున్న వారిని టార్గెట్ చేయబోతున్నారు. 2000 నుంచి 2020 మధ్య ఇలా ఆధునిక విద్య చదువుకున్న వారి డిగ్రీలు ఇక చెల్లవని తాలిబన్లు ప్రకటించారు.

 ఆప్ఘన్ పై పట్టు బిగిస్తున్న తాలిబన్లు

ఆప్ఘన్ పై పట్టు బిగిస్తున్న తాలిబన్లు

ఆప్ఘనిస్తాన్ లో తాలిబన్ల పాలన ప్రారంభమయ్యాక ప్రజాస్వామ్యం స్ధానంలో తిరిగి షరియా చట్టాల్ని అమలు చేస్తామని తాలిబన్లు స్పష్టం చేశారు. ఇందుకు అనుగుణంగానే క్రమంగా అడుగులు పడుతున్నాయి. ప్రజాస్వామ్యం, ఆధునిక విద్యపై ఏమాత్రం నమ్మకం లేని తాలిబన్లు.. దేశవ్యాప్తంగా వీటిపై నమ్మకం ఉన్న వారిని టార్గెట్ చేసే పనిలో ఉన్నారు. ముఖ్యంగా గత ప్రజా ప్రభుత్వాల పాలనలో ఆప్ఘనిస్తాన్ ఉన్న కాలంలో చదువుకున్న వారి చదువులు కూడా చెల్లుబాటు కావని తేల్చిచెప్పేస్తున్నారు. ప్రస్తుతం ఆప్ఘన్ లో ఉండి ఉద్యోగాలు చేయాలన్నా, అధికార పదవుల్లో ఉండాలన్నా తిరిగి షరియా చట్టాల ప్రకారం మదరసా విద్య అభ్యసించాల్సిందేనని తాలిబన్లు తేల్చిచెబుతున్నారు.

ఆ డిగ్రీలు చెల్లవన్న తాలిబన్లు

ఆ డిగ్రీలు చెల్లవన్న తాలిబన్లు

ఆప్ఘనిస్తాన్లో 2000 సంవత్సరంలో అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల మద్దతు కలిగిన ప్రభుత్వాల పాలన ప్రారంభమైంది. అప్పటి నుంచి 2020 వరకూ అంటే గతేడాది వరకూ వివిధ యూనివర్శిటీలు, విద్యాసంస్ధల రాకతో పాటు పాశ్చాత్య విద్య కూడా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఆప్ఘన్ లో యువత వీటిని అభ్యసించారు. వాటిలోనే డిగ్రీలు తీసుకున్నారు. ఈ రెండు దశాబ్దాల కాలంలో లక్షలాది మంది విద్యార్ధులు ఈ డిగ్రీలు తీసుకున్నారు. కానీ ఇప్పుడు వాటిని అంగీకరించేందుకు తాలిబన్లు ఇష్టపడటం లేదు. 2000 నుంచి 2020 మధ్య పట్టభద్రులైన వారి డిగ్రీలు ఇక చెల్లవని తాలిబన్లు తాజాగా ప్రకటించారు.

 విద్యామంత్రి హక్కానీ కీలక ప్రకటన

విద్యామంత్రి హక్కానీ కీలక ప్రకటన

ఆప్ఘన్ లోని తాలిబన్ల విద్యాశాఖ మంత్రి అబ్దుల్ బకీ హక్కానీ దేశంలో విద్యారంగం గురించి తాజాగా కీలక ప్రకటన చేశారు. ఇందులో తాలిబనేతర ప్రభుత్వాల హయాంలో చదివిన చదువులకు కానీ, వాటి ద్వారా పొందిన డిగ్రీలు కానీ చెల్లుబాటు కావని స్పష్టం చేశారు. తాలిబనేతర పాలనలో సాగిన ఆధునిక విద్య కంటే తాలిబన్ల పాలనలో అమలవుతున్న మదరసా విద్యే గొప్పదని కూడా ఆయన వెల్లడించారు. ఆప్ఘనిస్తాన్ లోని విశ్వవిద్యాలయాల అధ్యాపకులతో సమావేశమైన మంత్రి హక్కానీ.. దేశ సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా బోధించే వారిని తీసుకోవాలని కూడా కోరారు. వీరి నైపుణ్యాల్ని భవిష్యత్తులో దేశం వినియోగించుకుంటుందన్నారు.

 ఇప్పటికే స్కూళ్లకు బాలికలు దూరం

ఇప్పటికే స్కూళ్లకు బాలికలు దూరం


ఇప్పటికే తాలిబన్ల ప్రభుత్వ నిర్ణయం కారణంగా బాలికలు స్కూళ్లకు రావడం మానేశారు. షరియా చట్టాల ప్రకారం వారు బాలురతో కలిసి విద్యాభ్యాసం చేయడం నిషేధమని, అందుకే బాలికలను స్కూళ్లకు రప్పించడం లేదని తాలిబన్లు చెప్తున్నారు. ఇప్పుడు షరియా చట్టాల ప్రకారం మదరసా విద్యను ప్రోత్సహించేందుకు తాలిబన్లు ప్రయత్నిస్తున్నారు. దీంతో బాలురకు విద్యాసంస్ధల్లో షరియా చట్టాల ప్రకారం మదరసా విద్య, బాలికలకు ఇంటి వద్దే మదరసా విద్యను అందించేందుకు తాలిబన్ల ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది.

తాలిబన్ల దూకుతుతో వర్శిటీల బెంబేలు

తాలిబన్ల దూకుతుతో వర్శిటీల బెంబేలు

తాలిబన్ల ప్రభుత్వం విద్యా సంస్కరణలు అమలు చేస్తుండంతో ఇప్పటివరకూ ఆధునిక విద్య బోధించిన విశ్వవిద్యాలయాలు ఇప్పుడు రూటు మార్చుకోవాల్సి వస్తోంది. దీంతో కొన్ని వర్శిటీలు బాలికల విద్యను రద్దు చేశాయి. మరికొన్ని విద్యాలయాలు మాత్రం ఆన్ లైన్ విద్య కొనసాగిస్తున్నాయి. వాటిలోనూ ఇబ్బందులు తప్పడం లేదు. ఇంకొన్ని యూనివర్శిటీలు తాలిబన్ల విద్యాసంస్కరణల ప్రకారం మార్పులు చేసేందుకు సిద్దమవుతున్నాయి. దీంతో త్వరలో ఆప్ఘన్ విద్యావిధానంలో భారీ మార్పులు చోటు చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

English summary
the talibans announced that those who have graduated from high school in between 2000 and 2020 are of no use.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X