Taliban: తాలిబన్ వ్యవస్థాపకుడి కారు 21 ఏళ్ల క్రితం భూమిలో పూడ్చిపెట్టి ఇప్పుడు బయటకు తీశారు, ఎందుకంటే !
కాబూల్/అఫ్గానిస్తాన్: 9/11 ఘటన తరువాత అమెరికా బలగాలు అఫ్గానిస్తాన్ పై జరిపిన దాడుల నుంచి తప్పించుకోవడానికి తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ వాడిన ఓ కారును 21 ఏళ్ల తరువాత భూమిలో నుంచి తాలిబన్లు బయటకు తీశారు. అమెరికా బలగాల దాడుల నుంచి తప్పించుకోవడానికి ముల్లా ఒమర్ ఇదే కారు వాడి చివరికి తప్పించుకున్నారు. తాలిబన్ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్ టయోటా కరోలా తెల్లరంగు కారును చాలా సంవత్సరాలు ఉపయోగించాడు. ముల్లా ఒమర్ కు గుర్తుగా ఈ కారును 2001లో అఫ్గానిస్తాన్ లోని జాబుల్ ప్రావిన్స్ లోని ఓ గ్రామం సమీపంలోని తోటలో పాతిపెట్టారు. ఇప్పుడు ముల్లా ఒమర్ ఉపయోగించిన ఈ తెల్లరంగు టయోటా కరోలా కారును తాలిబన్లు బయటకు తియ్యడం హాట్ టాపిక్ అయ్యింది.

తాలిబన్ల వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్
అప్గానిస్తాన్ లో కాందహార్ లో ముల్లా ఒమర్ తాలిబన్ ను స్థాపించాడు. కొన్ని సంవత్సరాల పాటు అంతర్యుద్దం చేసిన తాలిబన్లు 1998 నాటికి అప్గానిస్తాన్ దేశంలోని చాలా ప్రాంతాలు వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ఇస్తామిక్ పాలన పేరుతో అప్గానిస్తాన్ లో కఠినమైన నిబంధనలు అమలు చేసిన తాలిబన్లు లెక్కలేనన్ని అరాచకాలు సృష్టించారు.

9/11, బిన్ లాడెన్ కు ఆశ్రయం ఇచ్చిన ముల్లా ఒమర్
అమెరికా 9/11 దాడుల తరువాత ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. ఒసామా బిన్ లాడెన్ అమెరికాలో జరిగిన 9/11 సూత్రధారి అని వెలుగు చూసిన తరువాత అమెరికా రగిలిపోయింది. అప్పటికే ఒసామా బిన్ లాడెన్ కు తాలిబన్లు ఆశ్రయం ఇచ్చారు. ఒసామా బిన్ లాడెన్ ను అప్పగించడానికి అప్పట్లో తాలిబన్లు నిరాకరించారు.

దెబ్బకు ముల్లా ఒమర్ ఎస్కేప్
ఒసామా బిన్ లాడెన్ ను అప్పగించడానికి నిరాకరించిన తాలిబన్ల మీద అమెరికా పంజా విసిరింది. 2001 అక్టోబర్ నుంచి అమెరికా దళాలు, నాటో సేనలు అఫ్గానిస్తాన్ లోని తాలిబన్లు ఉంటున్న ప్రాంతాల్లో వైమానిక దాడులు చేసింది. అమెరికా దెబ్బతో తాలిబన్ వ్యవస్థాపకుడు టయోటా కరోనా కారులో తప్పిచుకుని పారిపోయి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.
ఒమర్ కారును భూమిలో పాతిపెట్టిన తాలిబన్లు
2001లో తాలిబన్ నాయకుడు అబ్దుల్ జబ్బార్ ఒమారీ సమక్షంలో అఫ్గానిస్తాన్ లోని జాబుల్ ప్రావిన్స్ లోని ఓ గ్రామం సమీపంలోని తోటలో పాతిపెట్టారు. ఇప్పుడు ముల్లా ఒమర్ ఉపయోగించిన ఈ తెల్లరంగు టయోటా కరోలా కారును తాలిబన్లు చేతిపారల సహాయంతో ఆ కారును బయటకు తీశారు. ముల్లా ఒమర్ ఉపయోగించిన కారు బయటకు తీసే సమయంలో ఫోటోలు, వీడియోలు తీసిన తాలిబన్లు వాటిని విడుదల చేశారు.

ముల్లాకు గుర్తుగా మ్యూజియంలో కారు
చాలా సంవత్సరాలు 2013 వరకు అజ్ఞాతంలో జీవించిన ముల్లా ఒమర్ తరువాత చనిపోయాడు. అయితే చాలా సంవత్సరాల పాటు ప్రపంచానికి ముల్లా ఒమర్ చనిపోయిన విషయం తెలీకుండా దాచిపెట్టిన తాలిబన్లు తరువాత అసలు విషయం చెప్పారు. ముల్లా ఒమర్ ఉపయోగించిన టయోటా కరోలా తెల్లటి కారు ముందు భాగం మాత్రమే దెబ్బ తినిందని, దాని కండీషన్ ఇంకా బాగుందని జాబుల్ ప్రావిన్స్ సమాచార శాఖ డైరెక్టర్ రహ్మతుల్లా అమ్మద్ ప్రముఖ అంతర్జాతీయ వార్త సంస్థకు చెప్పారు. ముల్లా ఒమర్ ఉపయోగించిన కారును కాబుల్ లోి జాతీయ మ్యూజియంలో చారిత్రక స్మారక చిహ్నంగా ప్రదర్శిస్తామని తాలిబన్లు గొప్పగా చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications