Afghanistan: తాలిబన్ల అరాచకం బిగిన్స్..టీజర్ మాత్రమే: జలాలాబాద్‌లో విచక్షణారహితంగా కాల్పులు

కాబుల్: మొన్నటిదాకా ప్రశాంతంగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ప్రస్తుతం అల్లకల్లోలంగా మారింది. ఆటవిక పరిపాలనకు కేరాఫ్ అడ్రస్‌గా గుర్తింపు పొందిన తాలిబన్లు.. మరోసారి అదే తరహాలో ప్రవర్తిస్తోన్నారు. ఇంకా ప్రభుత్వాన్ని కూడా నెలకొల్పలేదు. ప్రజలు స్వేచ్ఛగా జీవించేలా చర్యలు తీసుకుంటామంటూ హామీ ఇచ్చి 24 గంటలు కూడా కాలేదు. అప్పుడే తమ పరిపాలన ఎలా ఉండబోతోందనే విషయం చిన్న టీజర్ వదిలారు. అసలు సినిమా ముందుందనే హెచ్చిరక సంకేతాలను పంపించారు.

తాలిబన్ల పరిపాలన ఎలా ఉంటుందో ఇప్పటికే ప్రపంచం మొత్తం ఒకసారి చవి చూసింది.. ప్రత్యేకించి- ఆ దేశ ప్రజలు. సంప్రదాయాల పేరుతో తాలిబన్లు విధించే ఆంక్షలు స్వయంగా భరించిన అనుభవం వారికి ఉంది. తాలిబన్ల పరిపాలనలో జీవించడం కంటే చావే నయమనుకుంటోన్నారక్కడి ప్రజలు. ఎప్పుడెప్పుడు దేశం విడిచి వెళ్లిపోదామా అంటూ ఎదురు చూస్తోన్నారు. పొరుగునే ఉన్న తజికిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ తమ సరిహద్దులను ఇప్పటికే మూసివేశారు.

Taliban fighters opened fire at protesters in Afghanistans Jalalabad, kills 2

ఆప్ఘనిస్తాన్ నుంచి ఎవరినీ రానివ్వట్లేదు. అదే సమయంలో కాబుల్, కాందహార్, మజర్-ఐ-షరీఫ్, జలాలాబాద్ వంటి సరిహద్దులకు ఆనుకుని ఉన్న నగరాల నుంచి వెలుపలికి వెళ్లే రహదారులను తాలిబన్లు బ్లాక్ చేశారు. నగరాలన్నింటినీ తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాలిబన్ల పరిపాలన నుంచి ఆఫ్ఘనిస్తానీయులు ఎందుకు భయపడి పారిపోవాల్సి వచ్చిందనడానికి నిదర్శనంగా నిలిచింది ఈ ఘటన. తాలిబన్ల దురాగతానికి అద్దం పట్టింది.

ఆఫ్ఘనిస్తాన్ జాతీయ పతాకాన్ని తొలగించడానికి అడ్డుకున్నారనే కారణంతో జలాలాబాద్‌లో తాలిబన్ ఫైటర్లు స్థానికులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. 10 మందికి పైగా గాయపడ్డారు. బుల్లెట్ గాయాలతో రక్తమోడుతోన్న వారిని అలాగే నడిరోడ్డు మీద వదిలేశారు. కనీసం ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయలేదు. ఆ అవకాశం కూడా వేరే వారికి ఇవ్వలేదు.

ప్రభుత్వ కార్యాలయాలపై ఎగురుతోన్న జాతీయ పతాకాలను తొలగించ ప్రయత్నానికి స్థానికులు అడ్డుకోవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. తాలిబన్లు తొలగించిన జాతీయ పతాకంతో జలాలాబాద్ వీధుల్లో ప్రదర్శన నిర్వహించడానికి ప్రయత్నించిన వారిని దాడులకు దిగారు తాలిబన్లు. దీన్ని కవర్ చేయడానికి ప్రయత్నించిన స్థానిక మీడియా ప్రతినిధులనూ వదల్లేదు. వారిపైనా దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పజ్‌వక్ ఆఫ్ఘన్ న్యూస్‌ మీడియా హౌస్‌కు చెందిన ముగ్గురు ప్రతినిధులకు గాయాలయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+