పేలుళ్ల ఎఫెక్ట్: కాబూల్ విమానాశ్రయాన్ని నిర్బంధించిన తాలిబన్లు, ఆప్ఘన్లకు తీరని కష్టాలు
కాబూల్: ఆఫ్ఘనిస్థాన్‌లో కొద్ది రోజుల క్రితం ఆత్మాహుతి దాడులు జరిగిన నేపథ్యంలో కాబూల్ విమానాశ్రయంను దిగ్బంధించారు తాలిబన్లు. విమానాశ్రయం వద్దకు చేరుకుంటున్న భారీ రద్దీని తగ్గించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు రాకుండా అడ్డుకునేందుకు అదనపు సిబ్బందిని మోహరించడంతోపాటు విమానాశ్రయానికి వెళ్లే దారుల్లో అదనంగా మరిన్ని చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు.
ఆప్ఘాన్ సైన్యం నుంచి స్వాధీనం చేసుకున్న వాహనాలతో తాలిబన్ ఫైటర్లు కాబూల్ రహదారులపై తుపాకీలతో తిరుగుతూ పహారా కాస్తున్నారు. కాబూల్ విమానాశ్రయానికి వెళ్లకుండా తాలిబన్లు అడ్డుకోవడంతో ఆప్ఘాన్ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాము ఇక్కడ బతకలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలంటూ వేడుకుంటున్నారు.

ఇది ఇలావుండగా, ఆప్ఘనిస్తాన్ లో తాజా సంక్షోభం నేపథ్యంలో అధికార పగ్గాలు చేపట్టబోతున్న తాలిబన్లు.. భారత్ విషయంలో, తమ దేశంలో చిక్కుకున్న భారత పౌరుల విషయంలో ఎలా వ్యవహరించబోతున్నారని ప్రపంచదేశాలు ఆసక్తికరంగా గమనిస్తున్నాయి. ఉపఖండంలోని ఈ వ్యూహాత్మక ప్రాంతంలో గతంలో భారీగా పెట్టుబడులు పెట్టిన భారత్.. ఇప్పుడు ఏం చేయబోతున్నది అనేది కూడా ఉత్కంఠ రేపుతోంది. ఇలాంటి సమయంలో తాలిబన్ల ప్రతినిధి ఒకరు పాకిస్తాన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత్ గురించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి.
కొన్ని ధశాబ్దాలుగా భారత ఉపఖండంలోని దేశాల మధ్య ఆధిపత్య పోరు సాగుతున్న నేపథ్యంలో భారత్ కు ఆప్ఘనిస్తాన్ తో చాలా అవసరం ఏర్పడింది. పాకిస్తాన్, చైనాలకు మధ్య నున్న ఈ దేశంలో వ్యూహాత్మకంగా అడుగులు వేయగలిగితే ఇరు దేశాలను కట్టడి చేయవచ్చన్న ఆలోచనతో భారత్ నిర్ణయాలు తీసుకుంది. తమ దేశం ఇబ్బందుల్ని కూడా లెక్కచేయకుండా ఆఫ్ఘనిస్తాన్ లో పార్లమెంటు నిర్మాణం సహా మౌలిక సదుపాయాల కోసం వేలాది కోట్లు ఖర్చుపెట్టేసింది. ఓవైపు పాశ్చాత్య దేశాల మద్దతు కలిగిన ప్రజా ప్రభుత్వం ఉండటంతో భారత్ కు ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాలేదు. కానీ తాజాగా పరిస్దితులు మారిపోయాయి.
రెండు దశాబ్దాలుగా ఆప్గనిస్తాన్ లో అధికారం కోసం ఎదురుచూస్తున్న తాలిబన్లకు మతపరంగా, రాజకీయ పరంగా, ఇతరత్రా అంశాల్లోనూ వైరం కొనసాగుతోంది. సహజంగానే పాకిస్తాన్ తో పాటు తీవ్రవాద సంస్ధల మద్దతు తీసుకుంటున్న తాలిబన్లు ఆ మేరకు భారత్ ను దూరం పెడుతున్నాయి. దీంతో తాలిబన్లతో భారత్ వైరం కొనసాగుతోంది. ఆప్ఘన్ గడ్డపై తాలిబన్లకు భారతీయులు లక్ష్యంగా మారిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తాజాగా కూడా భారతీయుడైన రాయిటర్స్ జర్నలిస్టు దానిష్ సిద్ధిఖీని కూడా తాలిబన్లు పొట్టనబెట్టుకున్నారు. ఇాలాంటి నేపథ్యంలో ఆఫ్ఘన్ లో మారిన పరిస్ధితులు భారత్ కు సహజంగానే ఆందోళన కలిగిస్తున్నాయి.
కాగా, ఇన్నాళ్లూ భారత్ తో వైరం నడిపిన తాలిబన్లు.. ప్రస్తుతం ఆప్ఘనిస్తాన్ లో మారిన పరిస్దితుల నేపథ్యంలో మన దేశానికి స్నేహహస్తం చాచారు. ఉపఖండంలోని కీలక దేశాల్లో ఒకటైన భారత్ తో సత్సంబంధాలు కోరుకుంటున్నట్లు తాలిబన్ల అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ కు చెందిన ఆరీ టీవీకి ఇఛ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయం వెల్లడించారు. భారత్ సహా ఏ దేశానికీ తాము వ్యతిరేకం కాదన్నాడు. అంతే కాదు ఆప్ఘన్ ప్రజల ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకుని భారత్ తమ విధానాలు రూపొందించాలని కోరుకుంటున్నట్లు ముజాహిద్ వెల్లడించారు.
-
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక












Click it and Unblock the Notifications