తాలిబన్లకు కొత్త భయం-తమ గ్రూపులోనే ఇంటిదొంగలు- వరుస దాడుల కారణమిదేనా ?

ఆప్ఘనిస్తాన్ లో ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసి అధికారాన్ని హస్తగతం చేసుకున్నంత సులుపుగా పాలన చేయడం తాలిబన్లకు చేతకావడం లేదు. గతంలో ఓసారి ప్రభుత్వాన్ని నడిపిన అనుభవం ఉన్నప్పటికీ మారిన పరిస్ధితుల్లో ఓవైపు ప్రభుత్వాన్ని నడుపుతూ, మరోవైపు ఉగ్రవాదుల దాడుల్ని ఎదుర్కొంటూ ముందుకెళ్లడం తాలిబన్లకు సవాల్ గా మారిపోయింది. దీంతో ఇప్పుడు వారి సుప్రీం కమాండర్ హైబతుల్లా అఖుంద్ జాదా చేసిన తాజా హెచ్చరికలు గమనిస్తే పరిస్ధితి తీవ్రత అర్ధమవుతుంది.

 ఆప్ఘన్ లో తాలిబన్ల పాలన

ఆప్ఘన్ లో తాలిబన్ల పాలన

ఆప్ఘనిస్తాన్ లో రెండునెలల క్రితం ప్రజా ప్రభుత్వాన్ని సాగనంపి అధికార పగ్గాలు అందుకున్న తాలిబన్లకు అడుగడుగునా సవాళ్లు తప్పడం లేదు. ముఖ్యంగా నానాటికీ దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్ధతో పాటు ప్రజల ఆకలి కేకలు, మరోవైపు ఉగ్రవాదులు వరుసగా సవాళ్లు విసురుతున్నాయి. దీంతో వీటిని ఎదుర్కొని ప్రభుత్వాన్ని నడపడం వారికి దినదిన గండంగా మారిపోతోంది. అదే సమయంలో సాధ్యమైనంత త్వరగా అంతర్జాతీయంగా గుర్తింపు తెచ్చుకోవడంలో విఫలమైతే మాత్రం మరిన్ని సమస్యలు తప్పేలా లేవు. దీంతో తాలిబన్లలో అంతర్మథనం సాగుతోంది.

 వరుస దాడులతో ఆందోళన

వరుస దాడులతో ఆందోళన

ఆప్ఘనిస్తాన్ లో అధికారంలో ఉన్న తాలిబన్లకు ఇప్పుడు నేరుగా ఏ తోడూ లేదు. గతంలో అధికారంలో ఉన్న ప్రజా ప్రభుత్వాలకు నాటో దళాల నుంచి భద్రతతో పాటు ఆయా దేశాల నుంచి ఆర్ధిక సహకారం కూడా ఉండేది. కానీ మారిన పరిస్ధితుల్లో వారి నుంచి అధికారం హస్తగతం చేసుకున్నప్పటికీ వారికి లభించిన సహకారం మాత్రం ఏ కోశానా అందడం లేదు. దీంతో ఇప్పుడు తమకున్న పరిమిత బలగంతోనే ఐసిస్ వంటి ఉగ్రవాద సంస్ధతో పోరాడాల్సిన పరిస్ధితి ఏర్పడుతోంది. దీంతో ఐసిస్-కె ఉగ్రవాదులు ఇప్పుడు విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. తమకున్న పరిమిత వనరులతో వీరిని కనిపెట్టి వేటాడటం తాలిబన్లకు సాధ్యం కావడం లేదు.

 తాలిబన్లలో అంతర్మథనం

తాలిబన్లలో అంతర్మథనం

ఆప్ఘనిస్తాన్ లో వరుస దాడులతో తాలిబన్లు దిక్కుతోచని పరిస్ధితుల్లో పడుతున్నారు. దీంతో వారిలో ఇప్పుడు అంతర్మథనం కనిపిస్తోంది. ఐసిస్ వరుస దాడుల వెనుక వారికున్న బలం, బలగాలపై అధ్యయనం మొదలుపెట్టిన తాలిబన్లు.. దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇప్పటికే జరిగిన దాడులపై సాగుతున్న దర్యాప్తులో వారికి కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటపడుతున్నాయి. దీంతో అంతర్మథనం కాస్తా వీరికి షాకులిస్తోంది. దీంతో ఇప్పుడు తదుపరి కార్యాచరణపై దృష్టిపెట్టాల్సిన పరిస్ధితులు ఎదురవుతున్నాయి.

 మరిన్ని దాడులు-ఇంటిదొంగలే కారణమన్న అఖుంద్ జాదా

మరిన్ని దాడులు-ఇంటిదొంగలే కారణమన్న అఖుంద్ జాదా

ఆప్ఘనిస్తాన్ లో ఇప్పటికే వరుస దాడులతో సతమతం అవుతున్న తాలిబన్లకు భవిష్యత్తులో మరిన్ని దాడులు తప్పవని వారి సుప్రీం కమాండర్ హైబతుల్లా అఖుంద్ జాదా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. ఐసిస్ తో పాటు తీవ్రవాద గ్రూపుల నుంచి ఈ దాడులు తప్పేలా లేవని అఖుంద్ జాదా తమ వారిని హెచ్చరిస్తున్నాడు. వీటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని వారిని కోరుతున్నాడు. అలాగే ఈ దాడులకు ఇంటిదొంగలే కారణమని షాకింగ్ వాస్తవాన్ని బయటపెట్టాడు. తనకున్న సమాచారం మేరకు తాలిబన్ల గ్రూపులోకి, ప్రభుత్వంలోకి చేరిన అతివాద గ్రూపుల వారే ఇప్పుడు తమ ఆనుపానులు కనిపెట్టి దాడులకు దిగుతున్నారని అఖుంద్ జాదా తాజాగా షాకింగ్ వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇప్పుడు తాలిబన్లు ఇంటిదొంగల్నే ఏరేసేందుకు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టాల్సిన పరిస్ధితులు తలెత్తుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+