వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

Taliban talks: కాబూల్ లో కౌంట్ డౌన్, తాలిబన్లు, అమెరికా పెత్తనం పీక్ స్టేజ్ లో, ఏం చేశారని !

|
Google Oneindia TeluguNews

కాబూల్/ వాషింగ్టన్/ న్యూఢిల్లీ: అఫ్గానిస్తాన్ లో గత 20 సంవత్సరాల నుంచి ఆహో ఓహో అంటూ పొడిచేసిన అమెరికా ఇప్పుడు పెట్టేపేడా సర్దుకుని వెళ్లి పోవడానికి సిద్దం అయ్యింది. ఇంతకాలం అమెరికా అండ చూసుకుని తాలిబన్ల తాటాకు చప్పుడుకు భయపడకుండా తిరిగిన ప్రజలు ఇప్పుడు అదే తాలిబన్లకు వంగివంగి సలామ్ లు చేస్తున్నారు. ఎదురు తిరిగితే తాలిబన్లు ఏసేస్తారిని తెలుసుకున్న అఫ్గానిస్తాన్ లోని అమాయక ప్రజలు ఎప్పుడు మా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో ? అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు. అమెరికాలో ఉన్న 4,500 మంది సైనికులను మంగళవారం సాయంత్రం లోపు తరలించడానికి అమెరికా అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. అయితే అనుకున్న గడువులోపు అమెరికా సైనికులు అందరూ ఆ దేశానికి తిరిగి వెళ్లడం సాధ్యం కాదని అమెరికా మిత్రపక్ష దేశాలు అంటున్నాయి.

మేము చెప్పిన టైమ్ కు అఫ్గానిస్తాన్ ను మీరు ఖాళీ చెయ్యాల్సిందే అని తాలిబన్లు ఇప్పటికే అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. ఎలాగైనా అమెరికా సైనికులు అందర్ని అఫ్గానిస్తాన్ ను తరలించాలని అగ్రరాజ్యం ప్రతినిధులు అనేక ప్రయత్నాలు చేస్తున్నది. ఇంతకాలం అఫ్గానిస్తాన్ లో పెత్తనం చెలాయించి అక్కడి సైనికులకు శిక్షణ ఇచ్చిన అమెరికా సైనికులకు ఇప్పుడు చిక్కులు ఎదురైనాయి. మంగళవారం సాయంత్రం లోపు సైనికులు అందర్ని తరలించడం సాధ్యం కాదని అమెరికా అంటున్నా అవన్నీ మాకు తెలీవు, మేము ఇచ్చిన గడువులోపు మీరు వెళ్లి పోవాల్సిందే అని తాలిబన్లు అమెరికాను మరోసారి హెచ్చరించడంతో కాబుల్ లో కౌంట్ డౌన్ మొదలైయ్యి టెన్షన్ వాతావరణం నెలకొంది.

Lady: భర్త ముందే బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్లిన భార్య, రాత్రికి రానని భర్తకు ఫోన్, హోటల్ లో దారుణ హత్య !Lady: భర్త ముందే బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్లిన భార్య, రాత్రికి రానని భర్తకు ఫోన్, హోటల్ లో దారుణ హత్య !

ఊహించని దెబ్బతో అమెరికాకు షాక్

ఊహించని దెబ్బతో అమెరికాకు షాక్

2001 సెప్టెంబర్ 9వ తేదీన (9/11) ఆల్ ఖైదా ఉగ్రవాదులు అమెరికాలోని ట్విన్ టవర్స్ ను కూల్చివేయడంతో వేలాది మంది అమాయకుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ట్విన్ టవర్స్ ను ఆల్ ఖైదా ఉగ్రవాదులు కూల్చివేయడంతో వారి అంతు చూడాలని ఆ రోజు అమెరికా ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.

 20 ఏళ్ల నుంచి అమెరికా పోరాటం

20 ఏళ్ల నుంచి అమెరికా పోరాటం

ట్విన్ టవర్స్ కూల్చివేయడంతో ప్రతీకారంగా అమెరికా సైనికులు అఫ్గానిస్తాన్ లో ఆల్ ఖైదా ఉగ్రవాదుల అంతం చూడటానికి ఆరోజు సిద్దం అయ్యింది. గత 20 సంవత్సరాల నుంచి అఫ్గానిస్తాన్ లో తిష్టవేసిన అమెరికా, నాటో బలగాలు ఉగ్రవాదుల అంతం చూస్తున్నాయి. గత 20 ఏళ్ల నుంచి అఫ్గానిస్తాన్ లో ఉగ్రవాదుల ఏరివేతలో నిమగ్నం అయిన అమెరికా బలగాల దెబ్బతో ఆల్ ఖైదా, తాలిబన్లు, ఐసిస్ ఉగ్రవాదులు ఇంతకాలం చాపకింద నీరులా వారి పని వారు చేసుకుంటూ వాటి ఉనికిని కొనసాగిస్తూనే ఉన్నాయి.

 అఫ్గానిస్తాన్ సైనికులకు అమెరికా ఏం శిక్షణ ఇచ్చిందో ?

అఫ్గానిస్తాన్ సైనికులకు అమెరికా ఏం శిక్షణ ఇచ్చిందో ?

అఫ్గానిస్తాన్ ఇంతకాలం అమెరికా బలగాల గుప్పింట్లో ఉండేది. అఫ్గానిస్తాన్ లో ఉగ్రవాదులను ఏరివేస్తున్న అమెరికా సైనికులు పనిలో పనిగా అఫ్గానిస్తాన్ సైనికులకు శిక్షణ ఇచ్చారు. ఇంతకాలం అమెరికా, నాటో బలగాలకు అఫ్గానిస్తాన్ సైనికులు కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చారు. అయితే తాలిబన్ల దెబ్బకు అఫ్గానిస్తాన్ సైనికులు చేతులు ఎత్తేయడంతో తాలిబన్ ఉగ్రవాదులు రెచ్చిపోవడంతో పరిస్థితి మొత్తం తారుమారు అయ్యింది. ఇంతకాలం అమెరికా సైనికులు తాలినబ్లకు ఇచ్చిన శిక్షణ ఇదేనా అంటున్నారు సామాన్య ప్రజలు.

 కథ మొదలు పెట్టిన డోనాల్డ్ ట్రంప్

కథ మొదలు పెట్టిన డోనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న సమయంలో డోనాల్డ్ ట్రంప్ ఓ నిర్ణయం తీసుకున్నారు. అఫ్గానిస్తాన్ లోని అమెరికా సైనికులను మా దేశానికి పిలిపించుకుంటామని డోనాల్డ్ ట్రంప్ అప్పట్లో చెప్పారు. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచే అఫ్గానిస్తాన్ లోని అమెరికా సైనికులు కొందరు కొందరే ఆ దేశానికి వెళ్లిపోయారు.

 ట్రంప్ హారతి ఇస్తే..... జో బైడెన్ మంగళం పాడేశారు

ట్రంప్ హారతి ఇస్తే..... జో బైడెన్ మంగళం పాడేశారు

అమెరికా అధ్యక్ష పదవి నుంచి డోనాల్డ్ ట్రంప్ దిగిపోవడం, జో బైడెన్ అమెరికా అధ్యక్షుడు కావడంతో సీన్ మారిపోయింది. అఫ్గానిస్తాన్ లోని అమెరికా బలగాలను వెనక్కి పిలిపించుకోవాలని ట్రప్ చేసిన ప్రతిపాధనను ప్రస్తుత అమెరికా అధ్యక్షడు జో బైడన్ వేగవంతం చేశారు. అంటే డోనాల్డ్ ట్రంప్ మంగళహారతి ఇవ్వడానికి కర్పూరం వెలిగిస్తే ప్రస్తుత అధ్యక్షుడు జో బైడన్ ఆ నిర్ణాయానికి పూర్తిగా మంగళహారతి ఇచ్చేశారని స్పష్టంగా కనపడుతోందని కొందరు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

 సర్వం సమర్పయామి

సర్వం సమర్పయామి

అఫ్గానిస్తాన్ లో కొంచెం కొంచెం అమెరికా బలగాలు వెనక్కి వెళ్లిపోవడం మొదలు పెట్టిన వెంటనే ఇంతకాలం గుంతకాడ నక్కల్లా సమయం కోసం వేచి చూసిన తాలిబన్లు అఫ్గానిస్తాన్ లోని ఒక్కొక్క ప్రాంతం స్వాధీనం చేసుకోవడం మొదలు పెట్టాయి. ఆగస్టు 14వ తేదీ నాటికి తాలిబన్లు అఫ్గానిస్తాన్ ను దాదాపుగా స్వాధీనం చేసుకోవడం కలకలం రేపింది.

 బతికుంటే బలిజాకు తినచ్చు.... ఈ దెబ్బలు ఎవడు తింటాడు

బతికుంటే బలిజాకు తినచ్చు.... ఈ దెబ్బలు ఎవడు తింటాడు

తాలిబన్లు రెచ్చిపోవడం, అఫ్గానిస్తాన్ సైనికులు చేతులు ఎత్తేయడంతో అప్పటి అఫ్గానిస్తాన్ దేశ అధ్యక్షుడు ఆలీ బతికుంటే బలిజాకు తినచ్చు, ఈ శాడిస్టుల దెబ్బులు ఎవరు తింటారు అంటూ రాత్రికి రాత్రే రైట్ రైట్ నాయకా అంటూ ఆదేశం విడిచి పారిపోవడంతో అక్కడి ప్రజలు షాక్ అయ్యారు. అఫ్గానిస్తాన్ దేశ అధ్యక్షుడు స్వయంగా పారిపోవడంతో ఆదేశంలోని ప్రజలు అదేదారిపట్టడంతో తాలిబన్లకు ఇంకా ఎత్తిన చెయ్యి అయ్యింది.

 తాలిబన్లకు వంగివంగి సలామ్ చేస్తున్న అమాయకులు

తాలిబన్లకు వంగివంగి సలామ్ చేస్తున్న అమాయకులు

ఇంతకాలం అమెరికా అండ చూసుకుని తాలిబన్ల తాటాకు చప్పుడుకు భయపడకుండా తిరిగిన ప్రజలు ఇప్పుడు అదే తాలిబన్లకు వంగివంగి సలామ్ చేస్తున్నారు. ఎదురు తిరిగితే తాలిబన్లు ఏసేస్తారిని తెలుసుకున్న అఫ్గానిస్తాన్ లోని అమాయక ప్రజలు ఎప్పుడు మా ప్రాణాలు గాలిలో కలిసిపోతాయో ? అంటూ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కాలం గడుపుతున్నారు.

 సాధ్యం కాదంటున్న అమెరికా

సాధ్యం కాదంటున్న అమెరికా

అమెరికాలో ఉన్న 4,500 మంది సైనికులను మంగళవారం సాయంత్రం లోపు తరలించడానికి అమెరికా అన్ని ప్రయత్నాలు చేస్తున్నది. అయితే అనుకున్న గడువులోపు అమెరికా సైనికులు అందరూ ఆ దేశానికి తిరిగి వెళ్లడం సాధ్యం కాదని అమెరికా మిత్రపక్ష దేశాలు అంటున్నాయి. ఎలాగైనా అమెరికా సైనికులు అందర్ని అఫ్గానిస్తాన్ ను తరలించాలని అగ్రరాజ్యం ప్రతినిధులు అనేక ప్రయత్నాలు చేస్తున్నది.

 కాబుల్ లో టెన్షన్ కు కౌంట్ డౌన్

కాబుల్ లో టెన్షన్ కు కౌంట్ డౌన్

ఇంతకాలం అఫ్గానిస్తాన్ లో పెత్తనం చెలాయించి అక్కడి సైనికులకు శిక్షణ ఇచ్చిన అమెరికా సైనికులు ఇప్పుడు చిక్కులు ఎదుర్కొంటున్నారు. మేము చెప్పిన టైమ్ కు అఫ్గానిస్తాన్ ను మీరు ఖాళీ చెయ్యాల్సిందే అని తాలిబన్లు ఇప్పటికే అమెరికాకు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం సాయంత్రం లోపు సైనికులు అందర్ని తరలించడం సాధ్యం కాదని అమెరికా అంటున్నా అవన్నీ మాకు తెలీవు, మేము ఇచ్చిన గడువులోపు మీరు వెళ్లి పోవాల్సిందే అని తాలిబన్లు అమెరికాను మరోసారి హెచ్చరించడంతో కాబుల్ లో కౌంట్ డౌన్ మొదలైయ్యి టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇదే సమయంలో అమెరికా బలగాలను పూర్తిగా తరిమేసి కాబుల్ ఎయిప్ పోర్టు స్వాధీనం చేసుకోవాలని తాలిబన్లు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

English summary
Taliban talks: US in final phase of evacuations from Kabul, Taliban says ready to take over Airport
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X