పేట్రోల్ ట్యాంకర్ పేలీ 50 మందికి పైగా దుర్మరణం
ఆఫ్రికా దేశంలోని నైజర్‌లో పేట్రోల్ ట్యాంకర్ పేలి సుమారు 55మందికి పైగా మృత్యువాత పడ్డట్టు నైజర్ మంత్రిత్వశాఖ అధికారి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఈ ఘటనలో మరో 35 మంది వరకు తీవ్రగాయల పాలయ్యారని వారు తెలిపారు.
ఆఫ్రికా దేశంలోని నైజర్‌లో ఓ పెట్రోల్ లారీ రైల్వే ట్రాక్ దాటుతుండగా బోల్తాపడింది. దీంతో అందులో ఉన్న పెట్రోల్ ను తీసుకెళ్లేందుకు ప్రజలు గుమికూడారు. పెట్రోల్ తీసుకెళుతున్న సమయంలోనే ఒక్కసారిగా పెట్రోల్ ట్యాంకర్ పేలిపోయింది. దీంతో పేట్రోల్ కోసం గుమికూడిన ప్రజలు మంటలకు అహూతయ్యారు. ట్యాంకర్ చుట్టు ఉన్నవాళ్లు అక్కడిక్కడే మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.

కాగా మరి కొంతమందిని ఆసుపత్రిలో చేర్పించారు. ప్రమాదం పెద్ద ఎత్తున జరగడంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు వారు తెలిపారు.కాగా ఈ సంఘటన ఆదివారం తెల్లవారు జామున జరిగినట్టుగా తెలుస్తోంది. ప్రమాదం జరగడంతో అక్కడ ఉన్న ఆస్థులకు పెద్ద నష్టం జరిగినట్టు తెలిపారు.












Click it and Unblock the Notifications