వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

డ్రాగన్ అక్కసు: మిలిటరీ చర్యలకు సిద్దం..? నాన్సీ పెలోసి పర్యటన నేపథ్యంలో చైనా..

|
Google Oneindia TeluguNews

తైవాన్ తమలో అంతర్భాగమేనని చైనా అంటోంది. కాదు.. తైవాన్‌లో ప్రజాస్వామ్యం మనగలిగేందుకు తాము అండగా ఉంటామని అమెరికా చెబుతోంది. ఆ క్రమంలోనే అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైపీలో అడుగుపెట్టాడు. దీంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఇక సైనిక చర్యలను ప్రారంభిస్తామని చైనా మంగళవారం రోజునే ప్రకటన చేసింది. దీంతో యావత్ ప్రపంచం అంతా ఏం జరుగుతుందోనని ఆందోళనలో ఉంది. ఇప్పటికే చైనిస్ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ హై అలర్ట్‌లో ఉందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతినిధి వు కియాన్ తెలిపారు.

 Targeted Military Actions Over Nancy Pelosi Taiwan Visit:china

జాతీయ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతను రక్షించడానికి, తైవాన్ స్వాతంత్ర్యం వేర్పాటువాద ప్రయత్నాలను అడ్డుకోవడానికి లక్ష్యంగా సైనిక కార్యకలాపాలన ప్రారంభిస్తామని వివరించారు. చైనా హెచ్చరికలు జారీచేసిన.. నాన్సీ పెలోసి మాత్రం తైవాన్‌లో గల తైపీలో అడుగుపెట్టారు. తైవాన్‌లో ప్రజాస్వామ్యం మనగలిగేందుకు అమెరికా మద్దతు ఇస్తోందని తెలిపారు. తైవాన్ అధినేతతో చర్చలు జరుపుతామని తెలిపారు. ఇండో పసిఫిక్ ప్రాంతాన్ని అభివృద్ది చేయడానికి తోడ్పటును అందిస్తామని వివరించారు.

తైవాన్‌లో గల 23 మిలియన్ల ప్రజలకు అమెరికా అండగా ఉంటుందని వివరించారు. గతంలో కన్నా ఇప్పుడు పరిస్థితి వేరుగా ఉందన్నారు. నిరంకుశత్వం, ప్రజాస్వామ్యం మధ్య ఎంపికను ప్రపంచం ఎదుర్కొబోతుందని పెలోసి అన్నారు.

English summary
China's military vowed Tuesday to launch "targeted military actions" in response to US House Speaker Nancy Pelosi's visit to Taiwan, as tensions flare between Washington and Beijing.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X