వరదలు: జూ నుంచి రోడ్లపైకి జంతువులు(వీడీయో)
బిలిసి: జార్జియాలో వరదలు బీభత్సం సృష్టించాయి. ఉధృతమైన వరదలకు చాలా ఇళ్లు, భవనాలు కుప్పకూలిపోయాయి. జార్జియా రాజధాని బిలిసిలోని జంతువుల ప్రదర్శనశాల(జూ)లో భారీగా వరద నీరు చేరుకోవడంతో జంతువులు తమ స్థావరాలను కోల్పోయి జూ నుంచి తప్పించుకున్నాయి.
మరికొన్ని జంతువులు జూలోనే చనిపోయాయి. కాగా, పులులు, సింహాలు, హిప్పోపొటమస్ తోపాటు జూలోని మిగితా జంతువులు రోడ్లకు మీదకు చేరుకున్నాయి. ఇప్పటికే ముగ్గురు జూ సిబ్బంది తోపాటు 9మంది మృతి చెందారు. మరో 10మంది గల్లంతయ్యారు.
తప్పించుకు తిరుగుతున్న జంతువుల్లో కొన్నింటిని తిరిగి పట్టుకోగా, మిగిలిన వాటి కోసం గాలిస్తున్నారు. ప్రజలను ఇంటి నుంచి బయటికి రావద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. హెలికాప్టర్లలో తిరుగుతూ పరిస్థితి పర్యవేక్షిస్తున్నారు.












Click it and Unblock the Notifications