అలా చేస్తే సరిపోతుంది: పవన్-జగన్‌లకు టిడిపి ఎంపీలు ఇలా కౌంటర్
తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో సోమవారం నాడు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ అంశంపై వాడిగా, వేడిగా చర్చ జరిగింది.
విజయవాడ: తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో సోమవారం నాడు ప్రత్యేక హోదా ప్రత్యేక ప్యాకేజీ అంశంపై వాడిగా, వేడిగా చర్చ జరిగింది. హోదా ముగిసిన అంశమని కేంద్రమంత్రి సుజనా చౌదరి సహా టిడిపి నేతలు చెబుతున్నారు.

పవన్-జగన్‌లకు ఇలా కౌంటర్
తద్వారా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసిపి అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డికి కొంటర్ ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా కావాలని, టిడిపి నేతలు ఏం చేస్తున్నారని జగన్, పవన్‌లు ప్రశ్నిస్తున్నారు. పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో టిడిపి ఎంపీలు పరోక్షంగా వారిద్దరికి కౌంటర్ ఇచ్చారు.

హోదాకు రాయితీలకు సంబంధం లేదు.. జేసీ
ప్రత్యేక హోదాకు, రాయితీలకు సంబంధం లేదని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అన్నారు. హోదా ప్రయోజనాలన్నీ ప్యాకేజీలోనే వస్తున్నాయన్నారు. కేంద్ర కేబినెట్ ఆమోదం పొందితేనే ప్యాకేజీకి చట్టబద్దత వస్తుందని చంద్రబాబు చెప్పారన్నారు. వైసిపి ఎంపీలు ఏం చేసుకున్నా తమకు సంబంధం లేదని చెప్పారు. జీఎస్టీ వచ్చాక ఏ రాష్ట్రానికి హోదా ఉండదన్నారు. హిమాచల్ ప్రదేశ్‌కు హోదా ఉన్నా అక్కడి నుంచి పరిశ్రమలు ఏపీకి తరలి వస్తున్నాయన్నారు.

ప్యాకేజీ యాక్టులో ఉంది కాబట్టి.. సీఎం రమేష్
ఏపీకి ప్రత్యేక ప్యాకేజీ యాక్టులో ఉంది కాబట్టి కేంద్ర కేబినెట్ ఆమోదం పొందితే సరిపోతుందని సీఎం రమేష్ అన్నారు. కేబినెట్ ఆమోదంతో చట్టబద్దత వస్తుందని చెప్పారు. ప్యాకేజీ యాక్టులో ఉంది కాబట్టి కేబినెట్ ఆమోదం లభిస్తే చాలని చెప్పారు.

మూడేళ్లుగా కేంద్రం నాన్చుతుంది.. టీజీ
ఈ సమావేశాల్లోనే ప్యాకేజీకి చట్టబద్దత వస్తుందని తాము భావిస్తున్నామని ఎంపీ టీజీ వెంకటేష్ అన్నారు. హోదా అంశాన్ని కేంద్రం మూడేళ్లుగా నాన్చుతోందన్నారు. వైసిపికి ఓటింగుకు పట్టుబడేంత బలం లేదని చెప్పారు.












Click it and Unblock the Notifications