కొలంబియాలో విమానం కూలి 10 మంది మృతి... మృతుల్లో ఐదుగురు చిన్నారులు

న్యూఢిల్లీ: కొలంబియాలో విమానం కూలి 10 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. ఇద్దరు సిబ్బంది, 8 మంది ప్రయాణీకులతో విమానం కొలంబియా రాజధాని బొగోటా నుంచి బాహియా సోలనో వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

Ten killed when small plane crashes in central Colombia

సిగ్నల్ మెకానికల్ ప్రాబ్లమ్ వల్ల మారిక్వైటా విమానాశ్రయం సమీపంలో విమానం కూలినట్లు అధికారులు తెలిపారు. అమెరికా పరిజ్ఞానంతో రూపొందించిన రెండు ఇంజన్ల పైపర్ PA-31 నవాజో విమానం అత్యవసర ల్యాండింగ్ అవుతున్న సమయంలో ఒక్కసారిగా కూలిపోవడంతో మంటలు చెలరేగాయని అధికారులు పేర్కొన్నారు.

ఈ విమానం ప్రైవేట్ ఏజెన్సీకి చెందినదిగా గుర్తించారు. ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న ఎమర్జెన్సీ వర్కర్స్ మృతదేహాలను తిరిగి స్వాధీనం చేసుకోగా... పోలీసులు ఈ ప్రమాదానికి ఖచ్చితమైన కారణం కోసం విచారణ ప్రారంభించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+