షాక్: ఎల్వోసీ వద్ద పాకిస్తాన్ మానవ రహిత విమానాలు
న్యూఢిల్లీ: సర్జికల్ స్ట్రయిక్ అనంతరం భారత్ - పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సరిహద్దు సమీపంలో పాకిస్తాన్ పైలట్ రహిత విమానాలు(యూఏవీ) నిఘా వేస్తున్నాయి. పాకిస్థాన్ బోట్లు హద్దులు దాటి భారత జలాల్లోకి ప్రవేశిస్తున్నాయి. మరోవైపు, కాల్పుల విరమణ ఉల్లంఘన కొనసాగుతోంది.
దేశ పశ్చిమ సరిహద్దుల్లో ఇటీవల పాకిస్థాన్ యూఏవీల కదలికలను గుర్తించినట్లు బీఎస్ఎఫ్ అధికారులు తెలిపారు. సరిహద్దుకు దాదాపు వంద మీటర్ల సమీపంలో యూఏవీలు సంచరించాయని, బహుశా మనవైపు సైనికుల సన్నద్ధత గురించి తెలుసుకోవడానికే పాక్ వీటిని పంపించి ఉండవచ్చన్నారు.
సరిహద్దుల వెంబడి బలగాలను, నిఘాను మరింత పెంచామని, ఎల్వోసీ వెంబటి మన బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని, అటువైపు నుంచి ఎలాంటి కవ్వింపు కనిపించినా, ఘాటుగా బదులిస్తామని బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ కేకే శర్మ తెలిపారు.

గుజరాత తీరంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ బోటును స్వాధీనం చేసుకున్న రెండు రోజులకే, పాక్ పడవ మరొకటి కనిపించింది. ఈసారి పంజాబ్‌లోని రావి నదిలోకి పాక్ బోటు చొరబడింది. అమృతసర్ జిల్లా తోటా పోస్టులో ఈ పడవను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఈ పడవలో అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని, ఇది నదీ ప్రవాహానికి భారత వైపునకు కొట్టుకుని వచ్చి ఉంటుందని అభిప్రాయపడ్డారు.
పాకిస్తాన్ పత్రికల హెడ్‌లైన్‌లో కేజ్రీవాల్: బీజేపీ ఆగ్రహంమరోవైపు, చేతిలో ఆయుధంతో నల్ల దుస్తులు ధరించిన వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్నాడని ఓ మహిళ ఇచ్చిన సమాచారంతో పంజాబ్‌లోని బటాలా పోలీసులు అప్రమత్తమయ్యారు. శిఖర్ మచ్చియన్ ప్రాంతంలో ఈ వ్యక్తి కనిపించినట్లు తమకు తెలిసిందని, వెంటనే గాలింపులు చేపట్టారు.












Click it and Unblock the Notifications