Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కాబూల్ ఎయిర్ పోర్ట్ కు ఉగ్రవాద దాడి ముప్పు ; వదిలి వెళ్ళాలని యుకె, యుఎస్, ఆస్ట్రేలియా పౌరులకు అలెర్ట్ !!

ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితి దారుణంగా తయారైంది. తాలిబన్లు ఆఫ్ఘనిస్థాన్ ను వశం చేసుకోవడంతో అక్కడ మళ్లీ ఆటవిక పాలన మొదలైంది. ఆఫ్ఘనిస్థాన్లో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్న పరిస్థితి ఉంది. ఆఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు ఆక్రమించుకోవడంతో తాలిబన్ల రాక్షస పాలన తట్టుకునే ఓపిక లేక ఎలాగైనా దేశాన్ని వదిలి వెళ్లాలని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు విఫల యత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే వేల మంది ఇతర దేశాలకు తరలిపోయారు. ఇంకా అనేక మంది కాబూల్ విమానాశ్రయం వద్ద పడిగాపులు కాస్తున్నారు. అమెరికా సైనికులను అభ్యర్థిస్తున్నారు.

ఆఫ్ఘనిస్థాన్ నుండి తరలింపు ప్రక్రియ మరింత కష్టతరం

ఆఫ్ఘనిస్థాన్ నుండి తరలింపు ప్రక్రియ మరింత కష్టతరం


ఇదిలా ఉంటే యూఎస్ దళాల ఉపసంహరణ నేపథ్యంలో కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఆగస్టు 31 లోపు ఆఫ్ఘనిస్థాన్ ను యూఎస్ దళాలు, ఇతర దేశాలకు సంబంధించిన దౌత్యవేత్తలు వదిలి వెళ్లాల్సి ఉంది. కానీ ఆఫ్ఘనిస్థాన్ నుండి వారు బయట పడటం కష్టంగా మారుతుంది. తాలిబన్లు అంతటా వాహనాలను చెక్ చెయ్యటం ఎప్పుడు ఏం చేస్తారో అర్ధం కాని పరిస్థితిలో వారు బయటకు రావాలంటేనే భయపడుతున్నారు.ఈ క్రమంలో వారిని తరలించటం అక్కడ ఉన్న యూఎస్ సైన్యానికి పెద్ద తలనొప్పిగా మారింది. తాలిబన్లు ఎవరికీ ఎలాంటి హాని చెయ్యమని చెప్తూనే నిత్యం ప్రజలకు నరకం చూపిస్తున్నారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితి కాబూల్ విమానాశ్రయం నుంచి వీరందరినీ తరలించడానికి ఇంకా సమయం పట్టేలా కనిపిస్తుంది.

ఆగస్ట్ 31 లోపు ఆఫ్ఘనిస్థాన్ ఖాళీ చెయ్యాల్సిందే

ఆగస్ట్ 31 లోపు ఆఫ్ఘనిస్థాన్ ఖాళీ చెయ్యాల్సిందే

ఇప్పటికే పలు దేశాలు గడువు పెంచమని అగ్ర దేశమైన అమెరికా కు విజ్ఞప్తి చేస్తుంటే, అమెరికా మాత్రం ఆగస్టు 31 లోపు ఖాళీ చేయాలని తేల్చి చెప్పేసింది. తాలిబన్ల హెచ్చరిక నేపధ్యంలో అమెరికా తాలిబన్ అగ్ర నాయకుడితో మంతనాలు జరిపారు. అమెరికాకు చెందిన కేంద్ర నిఘా సంస్థ డైరెక్టర్ రహస్య మంతనాలు జరిపి ఆగస్ట్ 31 లోపు ఖాళీ చెయ్యటం గురించి చర్చించినట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఒకపక్క కాబూల్ ఎయిర్ పోర్ట్ కు జనాలు పోటెత్తుతుంటే ఇతర దేశాల ప్రజలు తమ తమ దేశాలకు చేరుకోలేని పరిస్థితి నెలకొంది. ఆఫ్ఘనిస్థాన్లో ప్రస్తుత పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారవుతోంది.

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కాబూల్ ఎయిర్ పోర్ట్ కు ఉగ్ర ముప్పు

మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు కాబూల్ ఎయిర్ పోర్ట్ కు ఉగ్ర ముప్పు

మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా యుకె, యుఎస్ మరియు ఆస్ట్రేలియా కాబుల్ విమానాశ్రయానికి ఉగ్రవాద దాడి జరిగే అవకాశం ఉందని, ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ కారణంగా ప్రయాణించవద్దని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. విమానాశ్రయం వెలుపల గుమిగూడిన వారు వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని సూచించారు.ఉగ్రవాద దాడితో అధిక ప్రమాదం పొంచి ఉందని ముఖ్యంగా ఇస్లామిక్ స్టేట్ అనుబంధ గ్రూపు ఐఎస్ఐఎస్ గ్రూపు ఆత్మాహుతి దాడి గురించి యూ కె తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.

ఆఫ్ఘనిస్థాన్ లో కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న ప్రజలు దూరంగా వెళ్ళిపోవాలని హెచ్చరిక

ఆఫ్ఘనిస్థాన్ లో కాబూల్ ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న ప్రజలు దూరంగా వెళ్ళిపోవాలని హెచ్చరిక

ఆఫ్ఘనిస్తాన్‌లోని అమెరికన్‌లు సైతం గేట్ల వద్ద ఉన్న వారు భద్రతా బెదిరింపుల కారణంగా విమానాశ్రయంలో ప్రయాణించవద్దు లేదా గుమిగూడవద్దని అమెరికా సూచించింది. అబ్బే గేట్, ఈస్ట్ గేట్ లేదా నార్త్ గేట్ వద్ద ఉన్నవారు వెంటనే అక్కడి నుండి వెళ్లిపోవాలని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితి అత్యంత అస్థిరమైన, ప్రమాదకరమైన, పెద్ద సంఖ్యలో ప్రజలు హింసకు గురయ్యే ప్రమాదం ఉన్నట్లుగా కనిపిస్తుంది అని ఆస్ట్రేలియా పేర్కొంది. ఉగ్రవాద దాడి కొనసాగుతున్న హెచ్చరికల నేపథ్యంలో చాలా ఎక్కువ ముప్పు పొంచి ఉంది కాబట్టి కాబూల్ హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లవద్దు. మీరు విమానాశ్రయం ప్రాంతంలో ఉంటే, సురక్షితమైన ప్రదేశానికి వెళ్లి తదుపరి సలహా కోసం వేచి ఉండండి" అని సలహాదారు పేర్కొన్నారు.

తమ దేశ పౌరులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న యూకే, ఆస్ట్రేలియా, యూఎస్ లు

తమ దేశ పౌరులపై ఆందోళన వ్యక్తం చేస్తున్న యూకే, ఆస్ట్రేలియా, యూఎస్ లు

కాబూల్ విమానాశ్రయం చుట్టూ తాలిబాన్లు తమ నియంత్రణను బలోపేతం చేసుకున్న సమయంలో అనేక దేశాల సలహాలు వచ్చాయని, ఆఫ్ఘనిస్థాన్లో తమ పౌరుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయని పెంటగాన్ తెలిపింది. తాలిబాన్లు తమ చెక్‌పోస్టుల వద్ద తమ స్వంత భద్రతను పెంచుకున్నారు. అలాగే భారీగా గుంపులుగా వస్తున్నా ప్రజలను నియంత్రించే పనిలో పడ్డారు అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ జాన్ కిర్బీ వెల్లడించారు. ప్రస్తుతం కాబూల్ ఎయిర్పోర్ట్ నుంచి ఉగ్రవాద దాడి జరుగుతుందని హెచ్చరికల నేపథ్యంలో వివిధ దేశాల ప్రజలు రాలేని పరిస్థితి. ఇదే సమయంలో ఆగస్టు 31 లోపు ఖాళీ చేయకుంటే, దేశాన్ని వదిలి వెళ్లకుంటే తీవ్ర పరిణామాలు చూడాల్సి వస్తుందని ఇప్పటికే తాలిబన్లు హెచ్చరించారు.

Recommended Video

    G7 Meet On Afghanistan ఏ క్షణాన ఏ తుపాకీ ఎక్కుపెడుతుందో US కు Taliban వార్నింగ్ || Oneindia Telugu
    ఇప్పటికే సమయం సరిపోదని ఆందోళన .. ఇప్పుడు కొత్తగా ఉగ్ర ముప్పుతో చిక్కు

    ఇప్పటికే సమయం సరిపోదని ఆందోళన .. ఇప్పుడు కొత్తగా ఉగ్ర ముప్పుతో చిక్కు

    తాజా నివేదిక ప్రకారం తరలింపు ప్రక్రియ కోసం ఆగస్టు 31 గడువు ముగుస్తుంది. ఆగస్టు 15 న తాలిబన్లు రాజధాని నగరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నప్పటి నుండి కాబూల్ విమానాశ్రయం నుండి 80,000 మందికి పైగా ప్రజలు ఇప్పటివరకు తరలించబడ్డారు. విమానాశ్రయానికి ప్రజలు పోటెత్తడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొని, అక్కడ చోటు చేసుకున్న గందరగోళంలో కనీసం ఎనిమిది మంది మరణించారు. ఇక తాలిబన్ల హెచ్చరికల నేపధ్యంలో మరోవైపు ఆగస్టు 31 మాత్రమే డెడ్ లైన్ అని బైడెన్ సైతం తేల్చిచెప్పారు. ఇక ఇలాంటి పరిస్థితిలో ఆఫ్ఘనిస్తాన్ నుండి యూ కె, యూఎస్, ఆస్ట్రేలియా, ఇండియా తదితర దేశాల ప్రజలను తరలించడం పెద్ద రిస్కీ టాస్క్ గా మారనుంది. ఆగస్ట్ 31 లోపు తరలింపు ప్రక్రియ పూర్తి కాకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తం అవుతుంది.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+