టెర్రరిస్ట్ కు పాయిజన్ ఇంజక్షన్ ఇచ్చి చంపేయండి

బోస్టన్: అమెరికాలో అతి పెద్ద విద్వంసం సృష్టించిన టెర్రరిస్ట్ కు విషపూరిత ఇంజక్షన్ వేసి చంపేయండి అని అమెరికా న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అమెరికాలోని ఫెడరల్ కోర్టు ద్జోఖర్ త్సర్నేవ్ (21) అనే ఉన్మాధికి కఠిన శిక్ష విదించడంతో బాధితులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

2013 ఏప్రిల్ 15వ తేదిన బోస్టన్ నగరంలో మారథాన్ జరిగింది. మారథాన్ ముగింపు దగ్గర రెండు శక్తి వంతమైన ప్రెషర్ బాంబులు పేలిపోయాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు పోలీసులతో సహ ముగ్గురు మరణించారు. 264 మందికి తీవ్రగాయాలు అయ్యాయి.

వారిలో అనేక మంది శాశ్వతంగా కాళ్లు, చేతులు కోల్పోయారు. కేసు నమోదు చేసిన పోలీసులు వివిద కోణాలలో దర్యాప్తు చేశారు. చివరికి ద్జోఖర్ ను పోలీసులు ప్రాణాలతో పట్టుకున్నారు. అతని సోదరుడు ఎదురు తిరగడంతో పోలీసులు కాల్చి చంపేశారు.

terrorist Dzhokhar Tsarnaev has been sentenced to the death penalty

కర్గిజ్ స్థాన్ కు చెందిన ద్జోఖర్ సోదరులు మాసాచూసెట్స్ యూనివర్శిటిలో విద్యాభ్యాసం చేస్తున్నారు. ఇస్లామిక్ దేశాల మీద అమెరికా దాడులకు పాల్పడుతుందని వీరిద్దరు కక్ష పెంచుకున్నారు. అమెరికా మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం బోస్టన్ మారథాన్ దగ్గర బాంబు పేలుళ్లు జరిపారు.

అప్పటి నుండి కేసు విచారణ జరిగింది. శుక్రవారం కేసు తుది తీర్పు వెళ్లడించారు. ఇంత దారుణానికి పాల్పడిన ద్జోఖర్ కు ప్రాణాంతకమైన ఇంజక్షన్ ఇచ్చి వెంటనే చంపేయాలని, ఇలాంటి వారిని క్షమించరాదని న్యాయస్థానం తీది తీర్పు వెళ్లడించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+