ఎలాన్ మస్క్‌కు టెస్లా భారీ ప్యాకేజ్.. 1 ట్రిలియన్ డాలర్స్ జీతం ఆఫర్ !
టెస్లా కంపెనీ మరోసారి చరిత్ర సృష్టించే నిర్ణయం తీసుకుంది. ఎలాన్ మస్క్‌కు ఇప్పటివరకు ఎప్పుడూ వినిపించని స్థాయిలో భారీ వేతన ప్యాకేజీని ప్రతిపాదించింది. ఏకంగా 1 ట్రిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.83 లక్షల కోట్లు) అందించే ఈ ప్యాకేజీ ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారింది. ఇప్పటివరకు ఏ CEOకు ఇంతటి రెమ్యునరేషన్ ఆఫర్ కాలేదు. అయితే ఈ వేతనం పొందాలంటే మస్క్ అనేక ఆపరేషనల్, ఫైనాన్షియల్, టెక్నాలజీ లక్ష్యాలను చేరుకోవాలి.
వాస్తవానికి టెస్లా కంపెనీ అధినేతే అయినా అది లిస్టెడ్ కంపెనీ కాబట్టి అందులో ఆయనకు మేజర్ షేర్ ఉంది. దాంతోపాటు కంపెనీ CEO గా మస్క్ ప్రతి నెలా జీతం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డీల్ ప్రకారం.. టెస్లా ప్రస్తుత మార్కెట్ విలువ $1 ట్రిలియన్ నుండి కనీసం $8.5 ట్రిలియన్లకు చేరుకోవాలి. సంవత్సరానికి 20 మిలియన్ ఎలక్ట్రిక్ వాహనాలు డెలివరీ చేయాలి.

అలాగే, 10 మిలియన్ ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ సబ్‌స్క్రిప్షన్లు, 1 మిలియన్ రోబోలు, 1 మిలియన్ రోబోటాక్సీలు మార్కెట్లోకి రావాలి. వార్షిక లాభాలు $17 బిలియన్ల నుండి $400 బిలియన్లకు పెరగాలి. ఈ లక్ష్యాలు చేరుకున్నప్పుడే మస్క్‌కు చెల్లింపులు జరుగుతాయి.
కాలపరిమితి..
మస్క్ కనీసం 7.5 సంవత్సరాలు CEOగా, పూర్తి వేతనం పొందాలంటే 10 సంవత్సరాల పాటు టెస్లాలో కొనసాగాలి. అదనంగా, తన వారసుడి ప్రణాళికను కూడా సిద్ధం చేయాలి. చెల్లింపులు మొత్తం టెస్లా షేర్ల రూపంలోనే ఉంటాయి. ఈ ప్రణాళిక విజయవంతమైతే, మస్క్ టెస్లా స్టాక్‌లో సుమారు 423.7 మిలియన్ అదనపు షేర్లు పొందుతారు. దీని వలన ఆయన వాటా దాదాపు 29%కి పెరుగుతుంది.
2018 ప్లాన్‌తో పోలిక..
ఇంతకుముందు మస్క్ 2018లో $44.9 బిలియన్ ప్యాకేజీ పొందారు. అయితే, ఆ ప్యాకేజీపై కోర్టులో చట్టపరమైన సవాళ్లు ఎదురయ్యాయి. ఈసారి టెస్లా తన ప్రధాన కార్యాలయాన్ని టెక్సాస్‌కు మార్చుకోవడం వలన చట్టపరమైన సమస్యలు తక్కువగా ఉంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 2025 నవంబర్ 6న జరిగే వాటాదారుల సమావేశంలో ఈ కొత్త పే ప్లాన్‌పై ఓటింగ్ జరగనుంది.
మస్క్ విజయాలు & సవాళ్లు
ఎలాన్ మస్క్ ఒక సాధారణ EV స్టార్టప్‌ను ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆటోమేకర్‌గా మార్చారు. ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచి, ప్రపంచవ్యాప్తంగా టెస్లాను విస్తరించారు. అయితే, ప్రస్తుతం కంపెనీకి చైనా EVల నుంచి గట్టి పోటీ ఉంది. టెస్లా మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉన్నప్పటికీ, బోర్డ్ మస్క్‌పై ఇంతటి నమ్మకం ఉంచడం విశేషం.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఈ వేతన లక్ష్యాలను సాధించాలంటే మస్క్ రాజకీయాలపై దూరంగా ఉండాల్సి రావచ్చు. గతంలో ఆయన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని, కొత్త పార్టీని ప్రారంభిస్తానని ప్రకటించారు. అలాంటి నిర్ణయాలు టెస్లాతో పాటు మస్క్ ఇతర కంపెనీలకు కూడా ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
ఈ పే ప్యాకేజీ విజయవంతమైతే, మస్క్ ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్‌గా అవతరించనున్నారు. ఇది కేవలం ఆయన వారసత్వాన్ని మాత్రమే కాదు, కార్పొరేట్ నాయకత్వం భవిష్యత్తును కూడా పునర్నిర్వచిస్తుంది. అసాధారణమైన లక్ష్యాలు, అపారమైన రిస్క్ ఉన్నప్పటికీ, టెస్లా బోర్డ్ మస్క్‌పై ఉంచిన నమ్మకం విశేషమని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రణాళిక అమలు అయితే, మస్క్ ప్రభావం టెస్లాలో గణనీయంగా పెరుగుతుంది.
-
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్!












Click it and Unblock the Notifications