టెక్సాస్ స్కూల్లో కాల్పులు: 10మంది విద్యార్థులు మృతి!
టెక్సాస్: ఫ్లోరిడా స్కూల్ నరమేథాన్ని మరవకముందే అమెరికాలోని టెక్సాస్ లో మరో దారుణం జరిగింది. టెక్సాస్ లోని ఓ స్కూల్లో ఇద్దరు వ్యక్తులు జరిపిన కాల్పుల్లో 10మంది చిన్నారులు మరణించారు. స్థానిక పోలీస్ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించాయి.
కాల్పులు జరిపిన నిందితుల్లో ఒకరిని కస్టడీలోకి తీసుకున్నారు. మరో అనుమానితుడిని కూడా అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఒక పోలీస్ అధికారి కూడా గాయపడ్డట్టు తెలుస్తోంది. చనిపోయినవారంతా విద్యార్థులే అని సమాచారం.

స్కూల్ పరిసర ప్రాంతాల్లో కొన్ని పేలుడు పదార్థాలను కూడా పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో అనుమానిత వస్తువులపై ఒక కన్నేసి ఉంచాలని పోలీసులు వారికి తెలిపారు.కాల్పుల్లో గాయపడ్డ ముగ్గురిని టెక్సాస్ మెడికల్ బ్రాంచికి తరలించారు. ఇందులో ఒకరు 18సంవత్సరాల లోపు వ్యక్తి కాగా.. మరో ఇద్దరు మధ్య వయస్కులు అని డాక్టర్ తెలిపారు.
కాగా, కాల్పులు చోటు చేసుకున్న సాంటా ఫె స్కూల్ టెక్సాస్ పరిధిలోని గాల్వెస్టన్ కు 25మైళ్ల దూరంలో ఉంది. స్కూల్లో మొత్తం 1500మంది విద్యార్థులు చదువుతున్నట్టు తెలుస్తోంది.
-
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
భారీగా బీర్ల ధరలు పెంపు, ఏ బ్రాండ్ ఎంత.!! -
పద్మవ్యూహంలోకి ట్రంప్ ? ఇరాన్ లో భూతల దాడి నరకమేనా ? -
పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గింపు - కేంద్రం అనూహ్య నిర్ణయం, వంట గ్యాస్ రేట్లూ ఇక..!! -
బంగారం ధరల్లో అనూహ్యం- భారీగా రీబౌండ్ -
రామ్‌చరణ్ ‘పెద్ది’ గ్లింప్స్ పై రివ్యూ -
రామ్ చరణ్ బర్త్‌డే గిఫ్ట్ మామూలుగా లేదుగా! -
సమ్మర్ స్పెషల్ 'పెసరపప్పు చారు'.. ఇదొక్కటి యాడ్ చేస్తే టేస్ట్ అద్దిరిపోద్ది..! -
అమెరికన్ కరెన్సీ ఇకపై.. !! -
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర! -
యుద్ధానికి 10 రోజులు బ్రేక్: ట్రంప్ సంచలన నిర్ణయం!












Click it and Unblock the Notifications